రామ్ చరణ్ `వినయ విధేయ రామ` వేడుక ఈ సాయంత్రం మెగాభిమానుల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేదిక ఎన్నో సంశయాలకు, సందేహాలకు సమాధానంగా నిలిచింది. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. తెరాస నాయకుడు కేటీఆర్ మధ్య ఉన్న చక్కని సాన్నిహిత్యానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. ఈ వేదికపై పలువురు వక్తలు తమ స్పీచ్ లతో అదరగొట్టారు. దర్శకుడు బోయపాటి సైతం కేటీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తారు..
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారసత్వం అనేది అసమర్దుడికి బరువు. సమర్దుడికి బాధ్యత. రాజకీయాల్లో కె.సి.ఆర్ వారసుడిగా కె.టి.ఆర్ గారు.. సినిమాల్లో చిరంజీవి వారసుడిగా చరణ్ ఇద్దరూ వారి బాధ్యతల్ని సవ్యంగా.. సమర్ధంగా నిర్వహిస్తున్నారు. వారిద్దరూ ఓ వేదికపై ఉండటం ఆనందంగా ఉందని అన్నారు. `వినయ విదేయ రామ` టైటిల్ కె.టి.ఆర్ గారికి సరిగ్గా సరిపోతుంది. ఓ సమర్ధుడు నిలబడితే వందమంది సమర్ధులను నిలబెట్టడానికి అవకాశం లభిస్తుంది. అలాంటి చిరంజీవిని చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. గతేడాది ఖైదీ నంబర్ 150తో మరోసారి తన సత్తాను నిరూపించుకొన్నారు. మీరు సినిమాలు చేసుకోవాలని అందరినీ ముందుకు తోసి తను తప్పుకొన్నాడు. ఆ తర్వాత మళ్లీ వచ్చి అందరికంటే ఎక్కువ రికార్డులు కొల్లగొట్టాడు అని నిరూపించారు చిరు అని అన్నారు.
``చిరు తన కెరీర్ లో ఎన్నో దారులు వెతుక్కుంటూ వెళ్లి.. ఆయన తన వారసులకే కాదు - ఇండస్ట్రీలో చాలా మందికి రహదారి వేశారు. కొన్ని రోజులు పక్క నుండి ఇతరులను రికార్డులు క్రియేట్ చేయమని అన్నారు. తర్వాత మళ్లీ ఆయన వచ్చి అన్ని రికార్డులను కొల్లగొట్టి నవ్వుతూ నిలబడ్డారు. ఇప్పుడు మళ్లీ సైరా అని అంటున్నారు. ఆయన ఉంటే మనకు మంచిది. ఆయన మెలకువగా ఉంటే మేం కూడా మేలుకువగా ఉంటాం`` అంటూ బోయపాటి బ్రిలియంట్ స్పీచ్ తో ఆకట్టుకున్నారు. సినిమా గురించి చెబుతూ-``చరణ్ ను ఆర్టిస్ట్ గా ఏంటో మరోసారి సినిమాలో చూస్తారు. తప్పకుండా అందరూ గొప్పగా మాట్లాడుకునేలా ఉంటుంది. అందరూ గుండెపై చెయ్యి వేసుకుని చూడండని అందరి అభిమానులకు ఒక్క హామీ ఇస్తున్నాను. అజర్ బైజాన్ దేశంలో షూట్ చేశాం. అక్కడి ప్రభుత్వానికి, అందరికీ థాంక్స్. సినిమాలోపని చేసిన ప్రతి ఆర్టిస్ట్ వివేక్ ఒబెరాయ్ - ప్రశాంత్ - ఆర్యన్ రాజేశ్ - స్నేహ - హిమజ అందరూ ఓ ఫ్యామిలీగా నటించారు. నటించిన అందరికీ థాంక్స్. దేవిశ్రీ ప్రసాద్ తో ఐదు సినిమాలు చేశాను. ఐదు సినిమాలు ఐదు అద్భుతాలని చెప్పగలను... అని అన్నారు.