గుండు వీరుడా .. మ‌గ‌ధీరుడా?

Update: 2019-10-13 12:19 GMT
కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా అవ‌న్నీ ఒకెత్తు అనుకుంటే.. `సైరా న‌ర‌సింహారెడ్డి` ఒక్క‌టీ ఒకెత్తు అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 150 సినిమాలు ఒకెత్తు.. 151 ఒక్క‌టీ ఒకెత్తు! అని గ‌ర్వంగా చెప్పుకున్నారాయ‌న‌. అయితే ఆయ‌నే కాదు.. ఆ చిత్రంలో న‌టించిన బ్ర‌హ్మాజీ కూడా అంతే ఇదిగా చెప్పుకుంటున్నాడు. వీడియో ఆధారాలు స‌హా బ్ర‌హ్మాజీ త‌న ఆనందం వ్య‌క్తం చేస్తున్న తీరు మైమ‌రిపిస్తోంది. తాజాగా బ్ర‌హ్మాజీ సోష‌ల్ మీడియాలో రివీల్ చేసిన ఆ వీడియో ఔరా! అనిపిస్తోంది.

బ్ర‌హ్మాజీ ఓ గుర్రంపై స్వారీ చేస్తున్న ఈ వీడియో చూడ‌గానే షాక్ కి గుర‌వ్వాల్సిందే. అచ్చం ఒక వీరుడే ఇలా గుర్రంపై స్వారీ చేస్తున్నారా? అన్నంత సాలిడ్ గా క‌నిపిస్తున్నాడు. అస‌లే త‌ల‌పాగా.. రాజ‌రికం నాటి దుస్తులు.. వాటికి క‌ర‌వాలం అచ్చం ఆ రోజుల్లో వీరాధివీరుడైన సైనికుడిలాగా క‌నిపిస్తున్నాడు బ్ర‌హ్మాజీ. ఒక ర‌కంగా చెప్పాలంటే.. 1996లో ప‌దో త‌ర‌గ‌తి సోష‌ల్ టెక్ట్స్ బుక్ లో అచ్చేసిన సైనికుడిలా ఉన్నాడు. ఈ వీడియో వీక్షించిన ఓ అభిమాని .. ఈ వ‌య‌సులోనే ఇలా చేస్తే ఆ వ‌య‌సులో చంపేసి ఉంటారు అంటూ స‌ర‌దా వ్యాఖ్య‌లు చేశారు.

సైరాలో ఒక చిన్న పాత్ర ఇచ్చినా చేస్తాన‌ని నిర్మాత రామ్ చ‌ర‌ణ్ ని అడిగాన‌ని బ్ర‌హ్మాజీ అన్నారు. అయితే త‌న‌కు పూర్తి స్థాయి పాత్ర‌ను ఇచ్చార‌ని తెలిపారు.  ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో బ్రహ్మాజీ రోల్ చాలా కీలకం. ఆయన పోషించిన ఈ పాత్ర ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఉయ్యాలవాడ తో కలిసి బ్రహ్మాజీ చేసిన గుర్రపు స్వారీలు.. పోరాట ఘట్టాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఈ చిత్రంలో బ్ర‌హ్మాజీతో పాటుగా.. అమితాబ్ బచ్చన్- తమన్నా- నయనతార- విజయ్ సేతుపతి- కిచ్చా సుదీప్- జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News