బ్రహ్మి సప్తగిరిలు ఏమైపోయారు మావా?

Update: 2015-08-15 04:36 GMT
శ్రీమంతుడు వంటి మేను పర్వతాన్ని ఎదుర్కోవడానికి వారంలోనే సిద్ధపడ్డ వెంట్రుకలా రాజ్ తరుణ్ 'సినిమా చుపిస్త మావా'ని పోలిక పెట్టారు. అయితే ఈసారి వెంట్రుక వేసి లాగితే కొండ కదిలే సూచనలే కనిపిస్తున్నాయి. గత నాలుగైదు వారాలుగా పెద్ద సినిమాలు, భారీ సినిమాలు వస్తున్నాయి గానీ అన్నీ బాల్కనీ సినిమాలే కావడంతో నేల క్లాస్ ప్రేక్షకులు తనివితీరా చిత్రాన్ని ఆస్వాదించలేకపొతున్నారు.

ఈ లోటుని ఈ వారం విడుదలైన 'సినిమా చుపిస్త మావా' బాగానే పూడ్చింది. ఆవారాగా తిరిగే కుర్రాడికి ప్రేమ అందించే అందమైన మార్పుని 100శాతం ఎంటర్ టైన్మెంట్ డోస్ తో ప్రేక్షకులకు అందించాడు దర్శకుడు. సినిమా మొత్తం కామెడియన్లతో నింపేసి అవసరమైన చోట బానే గిలిగింతలు పెట్టించాడు. అయితే మొదట్నుంచీ ఈ సినిమా ట్రైలర్ లో కనువిందు చేసిన సప్తగిరి, బ్రహ్మానందంల సీన్లు ఒక్కటి కూడా సినిమాలో కనబడకపోవడం ఆశ్చర్యకరం.

బ్రాహ్మి, సప్తగిరి కాల్ షీట్లు ఇప్పుడు చాలా ఖరీదు. అలాంటివారిపై తీసిన సన్నివేశాలు తొలగించారంటే ఒకటి కధకు వాళ్ళ పాత్రకు సంబంధం లేకపోయి వుండాలి లేదా అంతర్గతంగా వీరిమధ్య విభేదాలు తలెత్తివుండాలి. ఏది ఏమైనా వీరిద్దరినుండీ కాస్త కామెడీ ఆశించిన వారికి చివరికి నిరాశే ఎదురైందని చెప్పాలి. సినిమాకెళ్ళే ముందు ఈ పాయింట్ మర్చిపోకండి.. 
Tags:    

Similar News