టెంప‌ర్ కూడా బ్ర‌హ్మీని కాపాడ‌లేదు

Update: 2015-12-25 05:20 GMT
ఇటీవ‌లి కాలంలో ఏ సినిమా చూసినా అందులో స్ఫూఫులే క‌నిపిస్తున్నాయ్‌. ఆల్రెడీ వ‌చ్చేసిన హిట్ సినిమాల్లోంచి హిట్ సీన్ల‌ను ఎత్తేసి, వాటికి స్ఫూఫ్‌ లు డిజైన్ చేసేస్తున్నారు మ‌న క్రియేట‌ర్స్‌. మ‌న ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌కు అంత‌కు మించి కామెడీ చేయ‌డానికి ఆప్ష‌న్ లేకుండా పోయింది. కొత్త త‌ర‌హా నేరేష‌న్ కోసం పాకులాడిన సంద‌ర్భాలే లేవు. ఇటీవ‌లి కాలంలో రిలీజ‌వుతున్న సినిమాల్లో పోకిరి - అత్తారింటికి దారేది - శ్రీ‌మంతుడు - బాహుబ‌లి లాంటి వాటికి స్ఫూఫ్‌ లు చేసేశారు. ఇప్పుడు లేటెస్టుగా రిలీజైన సౌఖ్యం మూవీలో టెంప‌ర్ మూవీని స్ఫూఫ్‌ లోకి దించేశారు. ఇందులో బ్ర‌హ్మానందం క్యారెక్ట‌ర్‌ కి టెంప‌ర్‌ - గ‌బ్బ‌ర్‌ సింగ్ అంత్యాక్ష‌రి సీన్ల తో కూడిన స్ఫూఫ్‌ ని అద్దారు. నా పేరు ద‌యా.. నాకు లేనిదే అది అంటూ తెగ కామెడీ ట్రై చేశారు. కానీ థియేట‌ర్ల‌లో జ‌నాల‌కు న‌వ్వు రాలేదు క‌దా! ఇర్రిటేష‌న్ పుట్టేసింది.
          
ఇలాంటి ద‌రిద్రపు కామెడీలు చూసేందుకు థియేట‌ర్ల‌కు రావాలా? అంటూ తిట్టిపోస్తున్నారు. మ‌రోసారి బ్ర‌హ్మానందం కెరీర్‌ లో డిజాస్ట‌ర్ కామెడీ ఇద‌ని తీవ్రంగా విమ‌ర్శ‌లొస్తున్నాయ్‌. సౌఖ్యం మూవీ ఆద్యంతం అస్స‌లు కామెడీ పండ‌లేద‌న్న విమ‌ర్శ‌లొచ్చాయి. దీనికి కోన అండ్ గ్యాంగ్ పూర్తి బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుందని అంటున్నారు.
        
ఇప్పుడొస్తున్న న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు ద‌య‌చేసి ఇలాంటి చెత్త స్ఫూఫ్‌ ల‌పై దృష్టి పెట్ట‌క‌పోతే కొత్త‌ద‌నం నిండిన సినిమాల్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌వ‌చ్చు. స్ఫూఫ్ లేని సినిమా చూడాల‌న్న ప్రేక్ష‌క‌దేవుడి కోరిక‌ను తీర్చే ఛాన్సుంటుంది. గాడ్ మ‌స్ట్ బీ క్రేజీ లాంటి కామెడీ సినిమాలు తెలుగులో వ‌చ్చేది ఎప్పుడో దేవుడా? ఆ సినిమాలో అంద‌రూ బ్ర‌హ్మానందంలే. ఒక్క బ్ర‌హ్మానందంనే చూసే ధైన్యం తెలుగులో ఇంకెన్నాళ్లు?
Tags:    

Similar News