నటి హేమ ఎక్కడ ఉన్నా ఒకటే సందడి. కిలకిలా నవ్వేస్తూ కిచకిచా మాట్లాడేస్తుంటుంది. కొలీగ్స్‌తో జోకులేస్తూ నిత్యం సెట్‌లో సందడి సందడి చేసేస్తుంది. అందుకే హేమ లేని తెలుగు సినిమా లేనేలేదు. అంతేకాదు హేమ నటించిన సినిమాల్లో మెజారిటీ భాగం హిట్ కొట్టినవే. అందుకే హేమను గోల్డెన్‌లెగ్‌గా పరిగణించి ప్రతిసినిమాకి ఎంపిక చేసుకుంటారు.
మెగాస్టార్ చిరు సినిమాల నుంచి నవతరం హీరో సాయిధరమ్ సినిమా వరకూ బోలెడన్ని సినిమాల్లో నటించేసింది హేమ. ఇప్పటికే 200పైగా సినిమాల్లో నటించేసింది. ఈ సందర్భంగా హేమ సెట్‌లో జరిగిన కొన్ని ఆసక్తికర సంగతుల్ని గుర్తు చేసుకుంటూ.. అప్పట్లో అతడు సినిమా షూటింగ్‌లో ఓ ఫన్నీ ఇన్సిడెంట్. అప్పుడే ఇంటికొచ్చిన ఇంటాయన (బ్రహ్మీ) చెప్పులిడిసి పెళ్లాన్ని చెడామడా తిట్టేసే సన్నివేశం. అసలే ఫైర్ మీద వచ్చినోడు చెప్పులు విడిస్తే ఎలా ఉంటుంది. గిరగిర ఇప్పేసి విసిరేస్తుంటాడు. అలా వచ్చిన చెప్పు ఒకటి నా మూతి పగలగొట్టింది. ఇంత లావు వాచిపోయింది. అది చూసి మహేష్ ఓ జోకు కూడా వేశారు. పక్కనే కృష్ణవంశీ శ్రీఆంజనేయం షూటింగ్ జరుగుతోంది. ఆంజనేయుడు లేకపోతే రీప్లేస్ చేసేద్దాం.. అన్నాడుట.
అంతేకాదు మురారి షూటింగ్ టైమ్‌లో ఏనుగుకు గుగ్గిళ్లు పెట్టే సీన్‌లో చేస్తున్నప్పుడు అది తొండం పుచ్చుకుని ఒక్కటిచ్చింది.. ఈ రెండు సన్నివేశాల్లో జనాలు మాత్రం తెగ భయపడిపోయారంటూ చెప్పి మళ్లీ కిలకిలా నవ్వేసింది హేమ. .