గత కొంతకాలంగా బ్రహ్మీ అలియాస్ బ్రహ్మానందం అనారోగ్యంతో సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఏజ్ దృష్ట్యా చాలా కాలంగా ఆయన సినిమాలు తగ్గించారు. తనవైపు వచ్చే స్క్రిప్టు- పాత్రలో క్రియేటివిటీ ఉంటేనే అంగీకరిస్తున్నానని వెల్లడించారు. రొటీన్ గా ఇంతకు ముందు చేసినవే రిపీటైతే నటించేందుకు ఆసక్తి గా లేనని ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. అయితే బ్రహ్మీ ఆలోచనా తీరుకు తగ్గట్టే సరైన కంబ్యాక్ లాంటి రోల్ ని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ క్రియేట్ చేశారని తెలుస్తోంది.
బ్రహ్మానందం తన కెరీర్ లో వందలాది పాత్రల్లో నటించారు. ఇక జంధ్యాల- ఈవీవీ.. ఆర్జీవీ- పూరి- కృష్ణవంశీ కాంపౌండ్ లో ఎన్నో అద్భుతమైన కామెడీ పాత్రలతో రంజింప జేశారు. అందులో బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేందుకు ఉపయోగపడిన విలక్షణ పాత్రలెన్నో. అరగుండు... నెల్లూరు పెద్దారెడ్డి.. కిల్ బిల్ పాండే.. ఇలా ఎన్నో అద్భుతమైన కామెడీ పాత్రల్లో మెప్పించారు. ఆయన చేసిన బాబాయ్ హోటల్ (జంధ్యాల దర్శకుడు) రోల్ అంతే బ్లాక్ బస్టర్. బాబాయ్ గా ఆ చిత్రంలో అద్భుతమైన హ్యూమరసాన్ని మించి ఎమోషన్ ని పండించారు.
ఇప్పుడు ఆ రేంజు పాత్రను బ్రహ్మానందం కోసం కృష్ణవంశీ క్రియేట్ చేశారని తెలుస్తోంది. అతడు తెరకెక్కిస్తున్న రంగ మార్తాండ చిత్రంలో అంతా వెటరన్ స్టార్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రమ్యకృష్ణ- ప్రకాష్ రాజ్ లాంటి టాప్ స్టార్లు నటిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం పాత్ర ఇతర పాత్రలకు ధీటుగా ఉంటుందట. ఆయన పాత్రలో బలమైన భావోద్వేగాలు ఉంటాయని.. కామెడీ కంటే ఎమోషన్ కి పెద్ద పీట వేసి ఈ పాత్రను తీర్చిదిద్దారని చెబుతున్నారు. సీరియస్ రోల్ లో బ్రహ్మీ ఆద్యంతం రక్తి కట్టించనున్నారని తెలుస్తోంది.
మరాఠీ చిత్రం నటసామ్రాట్ కు రంగమార్తాండ రీమేక్. ఈ చిత్రానికి సుస్వరాల ఇళయరాజా సంగీతం అందించనున్నారు. మధు కలిపు- అభిషేక్ జవ్ కర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు.. తమిళంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.