బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మాస్త్ర ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా వసూళ్ల విషయంలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. అసలు విషయం ఏంటీ అంటే సినిమా కి వచ్చిన టాక్ అనుసారంగా కాకుండా కాస్త బెటర్ కలెక్షన్స్ అయితే నమోదు అయ్యాయి. ఈ సమయంలోనే బడ్జెట్ కి వసూళ్లకి ఏమాత్రం పొంతన లేదని కొందరు వాదిస్తున్నారు.
ఇటీవల కంగనా రనౌత్ సోషల్ మీడియాలో బ్రహ్మాస్త్ర సినిమాకు ఏకంగా 600 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు అంటూ ఆరోపించింది. ఇంత డబ్బును వృధా చేసినందుకు దర్శకుడు అయాన్ ముఖర్జీ పై కేసు నమోదు చేయాలంటూ ఆమె వ్యంగ్యంగా స్పందించిన విషయం తెల్సిందే. బ్రహ్మాస్త్ర సినిమా యొక్క బడ్జెట్ విషయంలో జరుగుతున్న ప్రచారం అందరికి ఆశ్చర్యంను కలిగించింది.
సినిమా విడుదలకు ముందు వరకు 400 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా అంటూ ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు 600 కోట్ల రూపాయలు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు విషయం ఏంటా అంటూ అంతా కూడా చర్చించుకుంటున్నారు. తాజాగా హీరో రణబీర్ కపూర్ బడ్జెట్ విషయమై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఆయన షాకింగ్ గా కంగనా చెప్పినట్లుగా 600 కోట్ల బడ్జెట్ నిజమే అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
బ్రహ్మాస్త్ర సినిమా యొక్క బడ్జెట్ 600 కోట్ల రూపాయలు అనేది నిజమే.. కానీ ఒక్క పార్ట్ కోసం అంత ఖర్చు చేలేదు.. చేయడం లేదు. ఈ సినిమా మూడు పార్ట్ లుగా రాబోతుంది. మూడు పార్ట్ లకు కలిపి ఆ బడ్జెట్ ను కేటాయించినట్లుగా పేర్కొన్నాడు. అంటే ఒక్క పార్ట్ కి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా లెక్కలు చూపిస్తున్నారు.
వందల కోట్ల బడ్జెట్ అంటూ బ్రహ్మాస్త్ర గురించి వస్తున్న వార్తలకు తాజాగా క్లారిటీ రావడంతో బాలీవుడ్ సర్కిల్స్ లో మళ్లీ కొత్త తరహా లెక్కలు.. విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ కి 200 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది.. కనుక సినిమా ఇప్పుడు భారీగానే వసూళ్లు రాబట్టినట్లే అని...
కనుక బ్రహ్మాస్త్ర భారీ విజయాన్ని నమోదు చేసినట్లే అంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బ్రహ్మాస్త్ర మూడు పార్ట్ లు విడుదల అయ్యి అప్పుడు బడ్జెట్ వసూళ్ల లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.