కొవిడ్ కారణంగా బాలీవుడ్ సినిమాల బిజినెస్ ఎంత దారుణంగా దెబ్బ తిందో తెలిసిందే. ఇండియాలో మిగతా ఇండస్ట్రీలన్నీ వీలైనంత త్వరగానే కొవిడ్ ప్రభావం నుంచి కోలుకున్నాయి కానీ.. నార్త్ మార్కెట్లో చాలా చోట్ల సుదీర్ఘ కాలం థియేటర్లు మూతపడి ఉండడంతో హిందీ చిత్రాలకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు.
చివరికి థియేటర్లు పున:ప్రారంభమై పూర్తి స్థాయిలో నడవడం మొదలైనా.. ప్రేక్షకులను వెండితెరల వైపు ఆకర్షించి లాభాలు చేసుకున్న హిందీ చిత్రాలు చాలా చాలా తక్కువ. ఇటీవలే 'సామ్రాట్ పృథ్వీరాజ్' లాంటి భారీ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం తెలిసిందే. ఇక బాలీవుడ్ తర్వాతి ఆశ 'బ్రహ్మాస్త్ర'నే.
'ఏ జవాని హై దివాని' లాంటి బ్లాక్‌బస్టర్ తీసిన దర్శకుడు అయాన్ ముఖర్జీ.. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత.. రణబీర్ కపూర్-అమితాబ్ బచ్చన్-ఆలియా భట్-నాగార్జున లాంటి ప్రముఖ తారాగణం కలిసి చేసిన సినిమా ఇది. ఇది కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుందని చిత్ర బృందంతో పాటు బాలీవుడ్ జనాలు ఆశిస్తున్నారు.
సెప్టెంబరు 9న 'బ్రహ్మాస్త్ర' విడుదల కానుండగా.. రిలీజ్‌కు మూడు నెలల ముందే ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ అంతా విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలమే కనిపించింది. ముప్పులో పడ్డ మానవాళిని రక్షించడానికి బ్రహ్మాస్త్రాన్ని చేతబూని దుష్టశక్తులతో పోరాడే శివ అనే కుర్రాడి కథ ఇది. ముందుగా అతడి ప్రేమాయణాన్ని చూపించి.. ఆ తర్వాత అతను లోక కళ్యాణం కోసం పుట్టిన విషయాన్ని బయటపెట్టి.. బ్రహ్మాస్త్రాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న దుష్టశక్తులతో అతను పోరాడే వైనం నేపథ్యంలో మిగతా కథను నడిపించేలా కనిపిస్తోంది.
ఆలియా.. రణబీర్ ప్రేయసిగా, అమితాబ్ బచ్చన్ అతడి గురువుగా కనిపించిన ఈ చిత్రంలో నాగ్ ప్రత్యేక అతిథి పాత్రలో నటించారు. ఆయన పాత్ర గురించి వివరించి ఏమీ చూపించలేదు. ట్రైలర్లో కొన్ని క్షణాలు మెరిసి మాయమయ్యారాయన. ట్రైలర్లో విజువల్ ఎఫెక్ట్స్‌లో భారీతనం అయితే కనిపించింది కానీ.. అవేమీ కొత్తగా అయితే కనిపించలేదు. ఇలాంటివి మనం అంజి, దేవీపుత్రుడు లాంటి సినిమాల్లోనే చూసేశాం.
కథాంశం కూడా ఆ రెండు డిజాస్టర్ మూవీస్‌నే గుర్తు చేస్తోంది. హిందీ ప్రేక్షకుల మాటేమో కానీ.. తెలుగు ప్రేక్షకులకైతే 'బ్రహ్మాస్త్ర' అంత ఎగ్జైటింగ్‌గా ఏమీ అనిపించకపోవచ్చు. నిజానికి మన వాళ్లు చాలామంది ట్రైలర్ ఏదో తేడాగా ఉందనే అంటున్నారు. మరి సెప్టెంబరు 9న దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజవుతున్న 'బ్రహ్మాస్త్ర'కు ప్రేక్షకులు ఎలాంటి ఫలితాన్నిస్తారో చూడాలి.