‘బ్రహ్మోత్సవం’ అనే సినిమా మొదలైపుడు అది ఒక మోడర్న్ క్లాసిక్ అవుతుందన్న అంచనాలు కలిగాయి. అప్పటికే మహేష్ బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి మంచి సినిమాను అందించిన శ్రీకాంత్ అడ్డాల.. మరోసారి సూపర్ స్టార్ తో జత కట్టడం.. ‘బ్రహ్మోత్సవం’ లాంటి మంచి టైటిల్ పెట్టడం.. పీవీపీ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ చిత్రానికి ఎలాంటి ఫలితం వచ్చిందో తెలిసిందే. మహేష్ కెరీర్ కే ఒక మచ్చలా మిగిలిపోయిందా సినిమా. ఈ చిత్రం రిలీజైంది మే నెలలో. ఈ దెబ్బతో మహేష్ మళ్లీ మే నెలలో సినిమా రిలీజ్ చేయడానికే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. గత ఏడాది మహేష్ నుంచి వచ్చిన ‘భరత్ అనే నేను’ ఏప్రిల్లో రిలీజైంది. ఐతే ఈ సినిమా చిత్రీకరణ కొంచెం ఆలస్యమయ్యేలా ఉండటంతో మేలో రిలీజ్ చేద్దామని చూశారు. కానీ మహేష్ పట్టుబట్టి ఏప్రిల్‌కే సినిమా వచ్చేలా చేశాడు.
ఇప్పుడు ‘మహర్షి’ కూడా కొంచెం ఆలస్యమయ్యేలా ఉండటంతో ఏప్రిల్ 25 నుంచి మే నెలకు వాయిదా పడే పరిస్థిితి వచ్చిందట. ఐతే మహేష్ బాబు ఈ విషయంలో సీరియస్ అయినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను ఏప్రిల్లోనే రిలీజ్ చేయాలని తేల్చి చెప్పాడట. ఏప్రిల్లో మహేష్ ‘పోకిరి’ లాంటి బ్లాక్ బస్టర్ అందించాడు. కాబట్టి ఏప్రిల్, మే నెలల సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ నెలాఖరుకే సినిమాను ఫిక్స్ చేశారట. మే నెల గురించి మహేష్ భయపడ్డానికి ఇంకో సినిమా కూడా కారణమే. అతడి కెరీర్లో మరో పెద్ద డిజాస్టర్ అయిన ‘నాని’ కూడా ఆ నెలలోనే రిలీజైంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇకపై తన సినిమాల్ని మేలో రిలీజ్ చేయకూడదని మహేష్ ఫిక్సయిపోయినట్లు సమాచారం. ఏప్రిల్ 25కి ‘మహర్షి’ ఫిక్స్ కావడంతో మహేష్ అభిమానులు చాలా ఖుషీగా ఉన్న మాట వాస్తవం.