ఏదైనా ఒక ప్రాడెక్టును బాగా బ్రాండింగ్ చేసుకోవాలంటే.. దానికి చాలా స్ట్రాటజీలు కావాలి. అలాగే ఒక సినిమాను బ్రాండింగ్ చేయాలన్నా కూడా.. చాలా ఐడియాలు ఉండాలి. అసలు ఒక ప్రోడక్టును.. ఒక సినిమాతో కలిపి బ్రాండింగ్ చేస్తే?? అదే నమ్రతా శిరోద్కర్ ఐడియా. ఇప్పుడు బ్రహ్మోత్సవం ఫేవర్ లో బీభత్సంగా వర్కవుట్ అవుతోంది.
మొన్న ఒక చెప్పుల షాపు.. మహేష్ తన తండ్రి కాళ్ళకు చెప్పులు తొడిగే సీన్ ను బీభత్సంగా వాడుకుని.. బాగానే ప్రమోట్ చేసుకున్నారు. ఇవాళ కూడా అన్ని పేపర్లలో ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చారు. ఆ విధంగా మహేష్ తమకు బోలెడెంత సాయం చేసినట్లు. అయితే అందుకు భారీగానే చెల్లించారట. ఇకపోతే ఇప్పుడు ఒక ఎడిబుల్ ఆయిల్ (మంచినూనె) వారు.. తాజాగా తెలుగు రాష్ట్రంలలో ఈ ఆయిల్ తాలూకు పోస్టర్లు తెగ కనిపిస్తున్నాయి. బ్రహ్మోత్సవం మూవీ పోస్టర్ లోనే పక్కనే వీరి ఆయిల్ ప్యాకెట్ బొమ్మ వేసి మరీ బ్రాండింగ్ చేస్తున్నారు.
ఒక మూవీని ప్లాట్ఫామ్ గా చేసి.. ఇలా బ్రాండింగ్ చేయొచ్చని ఎవ్వరికీ అర్ధమైయుండదు. ఇకపోతే సింగిల్ స్ర్కీన్ ధియేటర్లలో కూడా.. ఈ బ్రాండింగ్ తాలూకు ప్రభావం కనిపిస్తోంది. ఉదయం 8 గంటలకు మొదలైన సంధ్య 70 ఎమ్.ఎమ్. ధియేటర్ షో లో.. దాదాపు 20 నిమిషాలు పాటు యాడ్లే యాడ్లు. మరి బ్రాండింగ్ లో మహేష్ బ్రహ్మోత్సవాన్నికింగ్ అనాల్సిందేగా.