ఇంతకీ బ్రహ్మోత్సవం ఎలా ఉందట..

Update: 2016-05-17 11:30 GMT
పెద్ద సినిమాలకు సెన్సార్ అయ్యిందంటే చాలు.. ఆటోమేటిగ్గా టాక్ బయటికి వచ్చేస్తుంది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌ లో ఒకటైన ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు నిన్నే సెన్సార్ అయిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల గత సినిమాల్లాగే దీనికి కూడా ఒక్క కట్ కూడా లేకుండా ‘క్లీన్ యు’ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సారోళ్లు. నిడివి రెండున్నర గంటలని చెబుతున్నారు. ఇక టాక్ సంగతి చూస్తే.. అంచనాలకు తగ్గట్లే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అంటున్నారు.

ప్రథమార్ధమంతా రొమాంటిగ్గా.. లైగర్ వీన్లో సాగుతుందని.. సరదా సన్నివేశాలు చాలా పడ్డాయని.. హీరోయిన్లతో మహేష్ రొమాన్స్ అదిరిందని సమాచారం. ద్వితీయార్ధం ఎమోషనల్ గా సాగుతుందట. ఐతే ద్వితీయార్ధంలో లాగ్ ఎక్కువైందన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ గత సినిమాలన్నింట్లో కూడా ద్వితీయార్దంలో ఎమోషన్ ఎక్కువుంటుందన్న సంగతి తెలిసిందే. ఐతే అతడి సినిమాలకు అలవాటు పడ్డవారికి ఇది పెద్దగా ఇబ్బంది కాకపోవచ్చని అంటున్నారు.

పాటలు కనుల పండువగా ఉంటాయని.. మహేషే సినిమాకు ప్రధాన ఆకర్షణ అని.. చాలా గ్లామరస్ గా కనిపించడమే కాక నటనతోనూ మెస్మరైజ్ చేశాడని సమాచారం. కాజల్-సమంతలతో మహేష్ కెమిస్ట్రీ సినిమాకు హైలైట్ అవుతుందని.. వీళ్ల కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు బాగుంటాయని చెబుతున్నారు. ఐతే సమంత-కాజల్ కాంబినేషన్లో మాత్రం సీన్స్ ఉండవట.  సినిమాలో ఎక్కడా హీరోయిజం పెద్దగా ఉండదని.. మాస్ ఆడియన్స్ కొంత నిరాశ చెందొచ్చని అంటున్నారు. మొత్తానికి ‘బ్రహ్మోత్సవం’ ప్రేక్షకుల్ని మెప్పించే అవకాశాలు మెండుగానే ఉన్నాయని తెలుస్తోంది.
Tags:    

Similar News