ఒక కొత్త సినిమా రిలీజైందంటే ఫస్ట్ షో అయ్యే సమయానికి బయట మైకులు పట్టుకుని రెడీగా ఉంటారు మీడియా వాళ్లు. ఐతే సినిమా ఫ్లాప్ అయినా సరే.. మీడియా మైకుల ముందుకొచ్చేసరికి మొహమాటం కొద్దీ అయినా బాగుందనో.. పర్వాలేదనో అంటారు. చాలా కొద్దిమంది మాత్రమే ఔట్ రేట్ గా సినిమా బాలేదని అనడం.. అసహనం చూపించడం చేస్తుంటారు. ఐతే ‘బ్రహ్మోత్సవం’ విషయంలో మాత్రం పబ్లిక్ రెస్పాన్స్ దారుణంగా వచ్చింది. మీడియా మైకుల ముందు మొహమాటం లేకుండా తన ఫ్రస్టేషన్ చూపించారు జనాలు. చాలామంది దారుణమైన కామెంట్లు కూడా చేశారు. ఐతే ఇంతకుముందు టాలీవుడ్లో వచ్చిన డిజాస్టర్లతో పోలిస్తే ఈ సినిమా మీద జనాలు చాలా ఎక్కువగా రియాక్టవడం.. ఫ్రస్టేట్ కావడం.. సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు పెట్టడానికి ప్రయత్నించడం అందరూ గమనించే ఉంటారు. ‘బ్రహ్మోత్సవం’ విషయంలో జనాలు ఇంతలా రియాక్టవడానికి కారణం లేకపోలేదు.
టాలీవుడ్లో ఇంతకుముందు వచ్చిన బిగ్గెస్ట్ డిజాస్టర్లను పరిశీలించి చూస్తే అందులో రెగ్యులర్ మాస్ సినిమాలుంటాయి. లేదంటే ప్రయోగాత్మక చిత్రాలుంటాయి. వేర తరహా సినిమాలూ ఉంటాయి. ఐతే ఫ్యామిలీ సినిమాలు ఇంత ఘోరమైన ఫలితాలు చవిచూడ్డం మాత్రం దాదాపుగా ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. ఇవి సాధ్యమైనంత వరకు సేఫ్ జోన్లోనే ఉంటాయి. మినిమం గ్యారెంటీ అన్న అభిప్రాయం ఉంటుంది. ఇంతకుముందు స్టార్ హీరోలు చేసిన ఫ్యామిలీ డ్రామాలు మరీ ఘోరంగా దెబ్బ తిన్న సందర్భాలు తక్కువ. కొన్ని సినిమాలకు నెగెటివ్ టాక్ వస్తే వచ్చి ఉండొచ్చు కానీ.. భరించలేని తరహాలో ఉన్న ఫ్యామిలీ సినిమాలు కనిపించవు.
ఇక ఈ సీజన్లో వచ్చిన మరో భారీ సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ డిజాస్టర్ కావడంలో మరీ ఆశ్చర్యమేమీ లేదు. దాని మీద ముందే కొంచెం నెగెటివ్ ఫీలింగ్ ఉంది. ఆ సినిమా తేడా కొట్టేందుకు ఆస్కారముందన్న అభిప్రాయాలు ముందే వ్యక్తమయ్యాయి. ఐతే ‘సర్దార్..’ ఫ్లాప్ అయితే అయ్యింది కానీ.. అది మరీ తీసి పారేయదగ్గ సినిమా కాదు. ఓ మోస్తరుగా అయినా పవన్ ఎంటర్టైన్ చేశాడు. కానీ ‘బ్రహ్మోత్సవం’ విషయంలో జరిగింది వేరు. ఇది పక్కాగా మంచి సినిమా అయి ఉంటుందని అంచనాలు పెట్టుకున్నారు. కాస్త లేటుగా థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఫస్ట్ డేనే సినిమాను ప్రిఫర్ చేశారు. ఐతే కచ్చితంగా బాగుంటుందని.. అలా కాకున్నా ఏవరేజ్ గా అయినా ఉంటుందని అనుకుంటే.. తెరమీద మాత్రం వారి అంచనాలకు పూర్తి భిన్నంగా బొమ్మ కనిపించింది. దీంతో తీవ్ర నిరాశకు గురై.. ఆ ఫ్రస్టేషన్ అంతా బయటికొచ్చి వెళ్లగక్కారు. ఇప్పటిదాకా ఫ్యామిలీ సినిమాలంటే సేఫ్ అన్న అభిప్రాయాన్ని ‘బ్రహ్మోత్సవం’ దారుణంగా దెబ్బ తీసి.. ఆ జానర్ సినిమాలకు చాలా చెడ్డ పేరే తెచ్చింది.