విడుదలకి ముందే కటింగులతో బాగా ట్రిమ్ అయిన బ్రహ్మోత్సవంకి విడుదల తర్వాత మరిన్ని కోతలు పడ్డాయి. సుమారు 12 నిమిషాలు కోత పెట్టినట్టు సమాచారం. నెగిటివ్ టాక్ ఫలితమే అది. ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. ఫస్ట్ హాఫ్ లో మాటి మాటికి వచ్చి పడిపోయే పాటలు కథని బాగా డిస్టర్బ్ చేశాయని, సెకండ్ హాఫ్ లో టూర్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా బోరింగ్ గా ఉన్నాయని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
ఆ స్పందన తెలుసుకొన్న చిత్రబృందం వెంటనే నష్ట నివారణకి నడుం బిగించింది. ఎక్కడెక్కడ లాగ్ అనిపించిందో అక్కడంతా సినిమాకి కోతలు పెట్టేశారు. తొలి సగభాగంలో వచ్చే పాటల్ని బాగా ట్రిమ్ చేశారని సమాచారం. నిజానికి ఈ కథనంలో కూడా లోపాలున్నాయి. కానీ దాన్ని ఇప్పుడేమీ చేయలేమని తెలుసుకొన్న చిత్రబృందం చేతిలో ఉన్నదంతా చేయడానికి సిద్ధమైంది. మరి ట్రిమ్ చేసిన వెర్షనైనా ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చోబెడుతుందో లేదో చూడాలి. అన్నట్టు ఈ సినిమా మొత్తం సిద్ధమయ్యాక చూస్తే దగ్గర దగ్గరగా 3 గంటల నిడివి వచ్చిందని సమాచారం. అప్పటికే బోలెడంత కట్ చేసింది చిత్రబృందం. ఆ కటింగులవల్లే కథ కూడా కాస్త పట్టుదప్పిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడున్న వెర్షన్ లోనే మరింత ట్రిమ్ చేశారన్నమాట.