ఓవర్సీస్ లో తనకి తిరుగులేదని మరోసారి చాటి చెప్పాడు మహేష్. ఇటీవల విడుదలైన ఆయన `బ్రహ్మోత్సవం` చిత్రానికి తొలి రోజే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అభిమానులు మొదలుకొని, సామాన్య ప్రేక్షకుల వరకు అందరూ కూడా సినిమా నిరుత్సాహపరిచిందని ఒప్పుకొన్నవాళ్లే. సోషల్ మీడియాలో అయితే జనాలు ఘాటుగానే స్పందించారు. మహేష్ నుంచి ఇలాంటి సినిమానా? అని విమర్శించారు. అయితే అమెరికాలో మాత్రం ఈ మిక్స్ డ్ టాక్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. అక్కడ సినిమాకి మంచి వసూళ్లే దక్కుతున్నాయి. అందుకే మరోసారి మిలియన్ డాలర్ల వసూళ్ల మార్క్ ని అవలీలగా అధిగమించాడు మహేష్. విడుదలైన మూడు రోజుల్లోపే `బ్రహ్మోత్సవం` 1.2 మిలియన్ డాలర్లు సాధించడం విశేషం.
అయితే ఈ వసూళ్లు సినిమాని గట్టెక్కించలేవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా రూ: 70కోట్లకి పైచిలుకు బడ్జెట్ తో తెరకెక్కినట్టు సమాచారం. ఆంధ్ర - తెలంగాణల్లో రెండో రోజే వసూళ్లు పడిపోయాయి. దీనివల్ల సినిమాకి భారీ నష్టాలు తప్పకపోవచ్చని చెబుతున్నారు. ఆ మాటెలా ఉన్నా మహేష్ అభిమానులు మాత్రం సంతోష పడటానికి ఓవర్సీస్ వసూళ్ల రూపంలో ఓ మంచి మాట వినిపిస్తోంది కదా అంటున్నారు. అదీ కరెక్టే. మహేష్ సినిమాలు ఓవర్సీస్ లో ఈ ఫీట్ ని సాధించడం ఇది ఆరోసారి. దూకుడు - ఆగడు - నేనొక్కడినే - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - శ్రీమంతుడు చిత్రాలు ఇప్పటిదాకా ఓవర్సీస్‌లో మిలియన్ మార్క్ ని అధిగమించాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి బ్రహ్మోత్సవం కూడా చేరినట్టైంది.