ఒక స్టార్ హీరో సినిమా ఓ రికార్డు నెలకొల్పితే.. ఆ తర్వాత వచ్చే అతడి తర్వాతి సినిమా దాన్ని దాటేయాలని ఆశిస్తారు అభిమానులు. మార్కెట్ రేంజి రోజు రోజుకూ పెరిగేదే తప్ప తగ్గేది కాబట్టి అలా ఆశించడంలో తప్పేమీ లేదు. అంతటితో ఆగకుండా వేరే స్టార్ నెలకొల్పిన రికార్డుల్ని కూడా దాటేయాలని కోరుకుంటారు. ‘బ్రహ్మోత్సవం’ సినిమా మీద ఉన్న హైప్ ప్రకారం చూస్తే ఈ సినిమా రికార్డుల మోత మోగించేయడం ఖాయమనే అనుకున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. గత ఏడాది ‘శ్రీమంతుడు’ నెలకొల్పిన రికార్డులతో పాటు.. ఈ మధ్యే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నెలకొల్పిన నాన్-బాహుబలి డే-1 రికార్డును కూడా దాటేయడం పక్కా అనే అనుకున్నారు. కానీ ‘బ్రహ్మోత్సవం’ ఆ ఘనతల్ని అందుకోలేకపోయింది.
తొలి రోజు తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్లలో సైతం అదనంగా ఓ షో పడ్డా సరే.. ‘బ్రహ్మోత్సవం’.. సర్దార్ రికార్డును దాటలేకపోయింది. కనీసం ‘శ్రీమంతుడు’ను డే-1 కలెక్షన్లను కూడా ఈ సినిమా అధిగమించలేకపోయింది. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా రూ.12.75 కోట్ల షేర్.. రూ.18.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ వరకు రూ.9.08 కోట్ల షేర్.. రూ.13.64 కోట్ల గ్రాస్... తెలంగాణలో రూ.3.67 కోట్ల షేర్.. రూ.5.16 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తంగా బాహుబలి.. సర్దార్ గబ్బర్ సింగ్.. శ్రీమంతుడు తర్వాత నాలుగో స్థానానికి పరిమితమైంది ‘బ్రహ్మోత్సవం’. తొలి మూడు రోజులకు అన్ని షోలూ ఫుల్ అయిపోయినట్లుగా వార్తలొచ్చాయి. మరి టాక్ ఎలా ఉన్నా కలెక్షన్లు తగ్గకూడదు కదా. మరి ఏం జరిగినట్లో?