ఓవర్సీస్‌ లో 4 మిలియన్ల పంచ్‌

Update: 2016-05-24 06:32 GMT
సాధరణంగా ఓవర్సీస్‌ డిస్ర్టిబ్యూటర్లకు అతి పెద్ద లాస్‌ వెంచర్లనేవి చాలా తక్కువ. ఎందుకంటే తెలుగు సినిమాల విషయంలో.. కేవలం మహేష్‌ బాబుకు తప్పిస్తే.. ఓవర్సీస్‌ లోఎక్కువ ధర పలికింది కేవలం బాహుబలి సినిమాకు మాత్రమే. వేరే ఎవ్వరికీ అంత ధర రాదు. ఇక ఫ్లాపు వస్తే.. వేరే సినిమాల విషయంలో ఒక 30-40 % లాస్‌ వస్తోంది. కాని ఇప్పుడు ''బ్రహ్మోత్సవం'' స్ర్టోక్‌ మామూలుగా లేదు.

ఎన్నడూ లేని విధంగా ''బ్రహ్మోత్సవం'' సినిమాకు భారీ పైకాన్నే చెల్లించారు ఓవర్సీస్‌ పంపిణీదారులు. ఈసారి ఏకంగా 13.2 కోట్లు పెట్టి కొన్నారు. అంటే షుమారు.. 4 మిలియన్‌ డాలర్ల గ్రాస్‌ వసూళ్ళు చేస్తే కాని.. ఈ 13.2 కోట్ల రూపాయలు తిరిగిరావు. అయితే ఇప్పటివరకు 4 మిలియన్ల ఫీట్‌ కేవలం బాహుబలి మాత్రమే చేసిందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పటికే 1 మిలియన్‌ డాలర్లు వసూలు చేసిన ''బ్రహ్మోత్సవం'' ఇక మహా అయితే ఇంకో 1 మిలియన్‌ చేస్తుంది. అది కూడా అత్యాశే అంటున్నారు ట్రేడ్‌ పండితులు. 1.5 నుండి 2 మిలియన్‌ మధ్యలో సినిమా క్లోజ్‌ అయినా కూడా.. అన్ని రకాల అదనపు ఖర్చులు కలుపుకుంటే.. ఖచ్చితంగా 50-60 % లాసులు వస్తాయట. ఇప్పటికే ఓవర్సీస్‌ లో ఇంత నష్టపోయిన బిగ్‌ స్టార్‌ సినిమా ఇదే అవుతుంది.

ఇంతకంటే భారీగా డిజప్పాయింట్‌ చేసిన సినిమాలు.. (1 కోటి పెడితే.. 10 లక్షలు వచ్చినవి) చిన్న చిన్నవి చాలానే ఉన్నాయి కాని.. బ్రహ్మోత్సవం లో ఇన్వాల్వ్ అయిన పైకం ఎక్కువ కాబట్టి.. ఖచ్చితంగా అటు నెం.1 హిట్‌ రికార్డుల్లోనూ.. ఇటు నెం.1 ఫ్లాపు రికార్డుల్లోనూ మహేష్‌ బాబే టాప్‌ పొజిషన్‌ లో ఉన్నాడు.
Tags:    

Similar News