తెలుగు సినిమాలకు అమెరికాలో మార్కెట్ తీసుకొచ్చిన హీరో మహేష్ బాబే. అతడి ‘దూకుడు’ సినిమాతోనే అక్కడ మన సినిమాలకు ఊపు మొదలైంది. సినిమా సినిమాకూ తన రేంజి పెంచుకుంటూ వెళ్లిన మహేష్ బాబు.. ఇప్పుడు ఫ్లాప్ సినిమాలతో సైతం మిలియన్ క్లబ్బును అందుకునే స్థాయికి ఎదిగాడు. హిట్టయితే మినిమం రెండు మిలియన్ డాలర్లు వస్తున్నాయి. మహేష్ లాస్ట్ మూవీ ‘శ్రీమంతుడు’ అక్కడ దాదాపు మూడు మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక లేటెస్ట్ మూవీ ‘బ్రహ్మోత్సవం’ అంచనాలకు తగ్గట్లుగా హిట్ టాక్ సంపాదిస్తే 4 మిలియన్ క్లబ్బును టచ్ చేసినా ఆశ్చర్యమేమీ లేదు.
విశేషం ఏంటంటే.. కేవలం ప్రిమియర్ షోలతోనే ‘బ్రహ్మోత్సవం’ మిలియన్ క్లబ్బుకు చేరువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేష్ కెరీర్లోనే అత్యధికంగా అమెరికాలో 206 స్క్రీన్లలో ‘బ్రహ్మోత్సవం’ రిలీజ్ చేస్తున్నారు. అన్ని ఏరియాల్లోనూ ప్రిమియర్ షోలు వేశారు. టికెట్ ధరలు కూడా రికార్డు స్థాయిలోనే ఉన్నాయి. నిన్న టికెట్ సేల్స్ ద్వారా ఓ దశలో హాఫ్ మిలియన్ డాలర్లు వచ్చినట్లుగా సోషల్ మీడియాలో అప్ డేట్స్ వచ్చాయి. మొత్తం ప్రిమియర్ షోలు అన్నింటి ద్వారా 8.5 లక్షల డాలర్ల దాకా వసూలవుతుందని అంచనా వేస్తున్నారు. కొందరు స్టార్ హీరోలు తమ సినిమాలకు ఫుల్ రన్లో సైతం ఈ మొత్తం వసూలు చేయలేని పరిస్థితి ఉంటే.. మహేష్ మాత్రం కేవలం ప్రిమియర్లతోనే ఇంత కలెక్ట్ చేయడమంటే మామూలు విషయం కాదు. ఓవర్సీస్ లో మహేష్ ఎంత పెద్ద స్టారో చెప్పడానికి ఇది ఉదాహరణ. ఇప్పటిదాకా ప్రిమియర్ షోలతో అత్యధికంగా వసూలు చేసిన రికార్డు ‘బాహుబలి’ పేరిట ఉంది. ఆ సినిమా 1.4 మిలియన్ డాలర్లు కొల్లగొట్టడం విశేషం.