‘బ్రహ్మోత్సవం’కు పూర్తి నెగెటివ్ టాక్ వచ్చినా సరే.. కొన్ని చోట్ల సూపర్ స్టార్ తన బాక్సాఫీస్ స్టామినా చూపిస్తున్నాడు. ఆల్రెడీ యుఎస్ లో మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టేసిందీ సినిమా. నైజాం.. ఆంధ్రాల్లోని కొన్ని ఏరియాల్లోనూ పర్వాలేదనిపిస్తోంది. మరోవైపు పొరుగు రాష్ట్రం కర్ణాటకలోనూ ‘బ్రహ్మోత్సవం’ అంచనాల్ని మించి ఆడేస్తోంది. కన్నడతో పాటుగా పోటీగా విడుదలైన సినిమాలన్నింటినీ వెనక్కి నెట్టి బెంగళూరులో ‘బ్రహ్మోత్సవం’ ఈ వీకెండ్ నెంబర్ వన్ ప్లేస్ సాధించడం విశేషం.
ఈ శుక్రవారం ‘బ్రహ్మోత్సవం’తో పాటుగా కన్నడ సినిమా ‘యు టర్న్’.. హిందీ మూవీ ‘సరబ్జిత్’.. ఇంగ్లిష్ సినిమా ‘ఎక్స్ మెన్ అపోకలిప్స్’ రిలీజయ్యాయి. ఈ నాలుగు సినిమాల్లో బ్రహ్మోత్సవమే బెంగళూరు బాక్సాఫీస్ లో నెంబర్ వన్ గా నిలిచింది. ఇంతకుముందు ‘లూసియా’ లాంటి సెన్సేషనల్ మూవీ తీసిన పవన్ కుమార్ నుంచి వచ్చిన రెండో సినిమా ‘యు టర్న్’ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా ఆ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది.
ఐతే దాని కంటే నెగెటివ్ టాక్ వచ్చిన బ్రహ్మోత్సవమే పైన నిలిచిందంటే మహేష్ కు కన్నడ నాట ఉన్న పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆశ్చర్యకరంగా ‘యు టర్న్’కు రెండో స్థానం కూడా దక్కలేదు. అది మూడో స్థానానికి పరిమితమైంది. ‘ఎక్స్ మెన్..’ రెండో స్థానం సాధించింది. ఐష్ సినిమా ‘సరబ్జిత్’ నాలుగో స్థానంలో నిలిచింది. మరో కన్నడ సినిమా ‘తిత్తి’ ఐదో స్థానంలో కొనసాగుతోంది.