మనోడి హాలీవుడ్‌ ప్రయత్నం ఫలించినట్లేనా?

Update: 2015-04-12 01:30 GMT
విధు వినోద్‌ చోప్రా అంటే హిందీ ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు అపారమైన గౌరవం. పరిందా, ఏకలవ్య, మున్నాభాయ్‌ సిరీస్‌, త్రీ ఇడియట్స్‌, పీకే లాంటి అద్భుతమైన సినిమాలు తీసి భారతీయ చలనచిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు విధు. రాజ్‌ కుమార్‌ హిరాని చేసిన అన్ని సినిమాలకూ ఆయనే నిర్మాత. ఈ సినిమాల్లో విధు రచనా సహకారం చాలా ఉంది. ఐతే రచయితగా, నిర్మాతగానే కాకుండా దర్శకుడిగానూ విధుది ప్రత్యేకమైన శైలి. పరిందా, ఏకలవ్య సినిమాలే దీనికి నిదర్శనం. ఐతే ఈ లెజెండ్‌ ఈ మధ్యే హాలీవుడ్‌ అరంగేట్రం చేశారు. 'బ్రోకెన్‌ హార్సెస్‌' సినిమాతో 62 ఏళ్ల వయసులో దర్శకుడిగా హాలీవుడ్‌లోకి  అడుగుపెట్టారు విధు. మూణ్నాలుగేళ్ల పాటు ఎంతో కష్టపడడి ఈ సినిమా తీసిన విధు.. ఎన్నో కష్టాలకు ఓర్చి శుక్రవారం నాడు తన సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఐతే సినిమాకు మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. జేమ్స్‌ కామెరూన్‌, స్టీఫెన్‌ స్పీల్‌బర్గ్‌ లాంటి లెజెండ్స్‌ ఈ సినిమాను మెచ్చుకున్నారు కానీ.. రివ్యూస్‌ మాత్రం అంత పాజిటివ్‌గా ఏమీ లేవు. నిజానిది బ్రోకెన్‌ హార్సెస్‌ కొత్త కాన్సెప్టేమీ కాదు. విధు 20 ఏళ్ల కిందట తీసిన పరిందా కథనే మార్చి.. హాలీవుడ్‌ జనాల టేస్టుకు అనుగుణంగా రీమేక్‌ చేశాడు విధు. ఐతే ''మనిషిని కొండచిలువ నెమ్మదిగా చుట్టుముట్టి మింగేసినట్లే బ్రోకెన్‌ హార్సెస్‌ కథ కూడా నెమ్మదిగా హృదయానికి హత్తుకుంటుంది'' అన్న కామెరూన్‌ మాటలు నిజమై.. బ్రోకెన్‌ హార్సెస్‌ ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించాలని ఆశిద్దాం.

Tags:    

Similar News