ఏదేమైనా.. బ్రూస్‌ లీ ఫిక్సయ్యిందంతే

Update: 2015-10-13 05:37 GMT
చారిత్రాత‌క్మ 3డి సినిమా రుద్ర‌మ‌దేవి రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని వ‌సూళ్లు తెస్తోంది. మొద‌టి మూడు రోజుల్లోనే 23 కోట్లు ఆర్జించి గుణ‌శేఖ‌రుని న‌మ్మ‌కాన్ని ఈ చిత్రం నిల‌బెట్టింది. మునుముందు మ‌రో వారం పాటు ఆడితే చాలు డెఫిషిట్ లేకుండా బైట‌ప‌డిన‌ట్టే. అయితే అంత‌వ‌ర‌కూ ఈ సినిమాని ఆడ‌నిస్తారా? అంటే డౌటే. ఎందుకంటే ఈలోగానే రామ్‌ చ‌ర‌ణ్ న‌టించిన బ్రూస్‌ లీ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తోంది.

శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దాదాపు 2000 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌డానికి నిర్ణ‌యించారు. ఏపీ - తెలంగాణ‌లోనే దాదాపు 1500 థియేట‌ర్లు బుక్క‌య్యాయి. అమెరికాలో 300 థియేట‌ర్ల‌లో రిలీజ‌వుతోంది. మిగ‌తా చోట్ల రిలీజ్ వివ‌రాలు తెలియాల్సి ఉందింకా. అయితే బ్రూస్‌ లీ దూకుడుకు ముకుతాడు వేయాల‌ని ఇప్ప‌టికే ఎంద‌రో ప్ర‌య‌త్నిస్తున్నారు. ద‌ర్శ‌క‌దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు గుణ‌శేఖ‌రునికి అండ‌గా నిలిచారు. బ్రూస్‌ లీని వారం పాటు వాయిదా వేయండి.. రుద్ర‌మ‌ను బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌నివ్వండి అంటూ ప‌ల్ల‌వి అందుకున్నారు. అయితే రుద్ర‌మ‌దేవి కంటే ముందే బ్రూస్ లీ రిలీజ్ తేదీని ఫిక్స్ చేశాం.. కుద‌ర‌దు అని యూనిట్ మాత్రమే కాదు.. అల్లు అర్జున్‌ కూడా చెప్పేశాడు.

ఇప్ప‌టికే డిజిట‌ల్ వెర్సన్‌ - ఫిజిక‌ల్ వెర్స‌న్లు థియేట‌ర్ల‌లోకి వెళ్లిపోతున్నాయి. కాబ‌ట్టి ఇక బ్రూస్‌ లీని ఆప‌డం ఎవ‌రి త‌రం కాదు అన్న సంగ‌తి క్లియ‌ర్ అయిన‌ట్టే. అయినా మార్ష‌ల్ కింగ్‌ ని ఆప‌డం ఎవ‌రి త‌రం? పైగా ఈ సినిమా కూడా 50 కోట్లకు పైనే రికవర్‌ చేయాలట. సో.. వచ్చి తీరాల్సిందే అంటూ గట్టి పట్టే పట్టేశారు బ్రూస్‌ లీ గ్యాంగ్‌. ఈరోజు ఉదయం పేపర్‌ యాడ్లతో ఈ విషయం కన్‌ ఫామ్‌ అయ్యింది కూడా.. బ్రూస్‌ లీ ఆన్‌ అక్టోబర్‌ 16.. గెట్‌ రెడీ!!
Tags:    

Similar News