బ్రూస్‌ లీ డేట్‌ మారిస్తే సీన్‌ సితారే

Update: 2015-10-10 05:30 GMT
పబ్లిసిటీ కోసం చేస్తున్నారో.. లేక నిజంగానే కృతజ్ఞతా భావంతో చేస్తున్నారో తెలియదు కాని.. తుమ్మల పల్లి రామసత్యనారాయణ అనే ఓ నిర్మాత ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవికి ఒక ఓపెన్‌ లెటర్‌ పంపేశారు. రుద్రమ దేవి కోసం బ్రూస్‌ లీ ని వాయిదా  వేయమంటున్నారు. దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని మెగాస్టార్‌ ఎలా స్పందిస్తారు అనేదే పెద్ద విషయం. కాని చివరాకరకు వచ్చాక ఇప్పుడు ఇరికించడం కాకపోతే.. అసలు ఈ టైమ్‌ లో డేటు మార్చడం కుదురుతుందా?

నిజానికి సినిమా షూటింగ్‌ మొదలెట్టినప్పుడే దసరా బరిలో మేమున్నాం అంటూ బ్రూస్‌ లీ టీమ్‌ అక్టోబర్ 16ను ఫిక్సు చేసుకుంది. పైగా చెప్పిన డేటుకే చివరకు సినిమాను కూడా దించేస్తున్నారు. ఒకవేళ రుద్రమదేవి.. బ్రూస్‌ లీ.. ఒకేసారి డేటు కోసం తర్జన భర్జన పడుంటే.. ముందుగానే ఏదైనా గ్యాపింగ్‌ ప్లాన్‌ చేశేవారేమో. కాని 16న బ్రూస్‌ లీ ఉందని తెలిసి కూడా గుణశేఖర్‌ 9నే ఫిక్సు చేసుకున్నాడు. ఏదో సైజ్‌ జీరో టీమ్‌ అంటే డేట్‌ మార్చేసుకున్నారు కాని.. బ్రూస్‌ లీ ని మార్చమంటే కష్టమే. ఎందుకంటే ఇప్పటికే ఓవర్‌ సీస్‌ లో కూడా ధియేటర్లన్నీ కన్‌ ఫామ్‌ అయిపోయాయ్‌. లోకల్‌ గా కూడా ఎగ్రిమెంట్ల పనంతా పూర్తయిపోయి.. కొన్ని టౌనుల్లో ఏకంగా రిలీజ్‌ రోజును ఓ నాలుగైదు ధియేటర్లలో చెర్రీ సినిమాను వేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. పైగా రుద్రమదేవికి కాస్త మిక్సడ్‌ టాక్‌ రావడంతో.. ఇక పంపిణీదారులందరూ కాసులు కురిపంచే చరణ్‌ ఎప్పుడొస్తాడో అంటూ వెయిటింగ్‌ చేస్తున్నారు.

సప్పోజు.. ఫర్‌ సప్పోజు.. చిరంజీవి కాస్త కరిగిపోయి నిర్మాత డివివి దానయ్యపై ఒత్తిడి తెచ్చి.. బ్రూస్‌ లీ రిలీజ్‌ డేట్‌ మారిస్తే.. ఈ సినిమానే నమ్ముకునున్న డిస్ర్టిబ్యూటర్ల సీన్‌ సితార్‌ అయిపోతుంది. తెలుగు రాష్ట్రంలలోనే కాకుండా ఫారిన్‌ లో కూడా ఈ సినిమాపై భారీ నమ్మకం పెట్టుకొని గ్రాండ్‌ గా రిలీజ్‌ ప్లాన్‌ చేశారు. ఏ మాత్రం తేడా వచ్చిన కూడా భారీ నష్టాలే చవిచూస్తారు వారందరూ.
Tags:    

Similar News