ఉప్పెన బాబును నమ్మి 250 కోట్లా?

Update: 2022-12-11 01:30 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన 15 సినిమాను శంకర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తవక ముందే రామ్ చరణ్ తేజ్ మరొక సినిమాను మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. తన 16వ సినిమాను ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో చేయాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.

అయితే ఈ ప్రాజెక్టు పై అధికారికంగా త్వరలోనే క్లారిటీ రానుంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో నటినటుల విషయంలో కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇక ఈ సినిమాను వెంకట సతీష్  నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు బుచ్చిబాబు బిజీగా ఉన్నాడు. మొదట జూనియర్ ఎన్టీఆర్ కోసం అనుకున్న స్పోర్ట్స్ ప్యాక్ డ్రాప్ మూవీ కథను ఇప్పుడు రామ్ చరణ్ కోసం కొంత చేంజ్ చేసి తీసుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ బడ్జెట్ విషయంలో మాత్రం నిర్మాత దర్శకుడు ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం నిర్మాతలు దాదాపు 250 కోట్ల నుంచి 300 కోట్ల మధ్యలో ఖర్చు చేయనున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు పూర్తిస్థాయిలో విలేజ్ బాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నాడు. అంతేకాకుండా ఇది కబడ్డీ స్పోర్ట్స్ డ్రామా అని కూడా అంటున్నారు.

విలేజ్ సెట్స్ కూడా ప్రత్యేకంగా వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొంత ఆర్ట్ వర్క్ కు సంబంధించిన ప్లాన్ కూడా రెడీ అయినట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు 250 కోట్ల రూపాయి  ఖర్చు చేయడానికి కూడా నిర్మాత సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

అయితే దర్శకుడు బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో 100 కోట్ల మార్కెట్ను అందుకున్నప్పటికీ ఆ రేంజ్ లో రామ్ చరణ్ ను చూపిస్తాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. అతని టాలెంట్ గురించి అయితే రామ్ చరణ్ పూర్తిస్థాయిలో నమ్మకంతో ఉన్నాడు. మరి బుచ్చిబాబు ఆ నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News