టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా. ఉప్పెన మూవీ వచ్చేంత వరకు తన పేరు, గుర్తింపు అదే. కానీ తన మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు బుచ్చిబాబు. కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి కాంబోలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించి హిట్ అందుకుంది. సాధారణ లవ్ స్టోరీనే మంచి స్క్రీన్ ప్లేతో అంతకుమించిన క్లైమాక్స్ తో అలరించాడు బుచ్చిబాబు. కథను, స్క్రీన్ ప్లేను నమ్ముకుని తన టాలెంట్ పై విశ్వాసం ఉంచి ఈ సినిమా తీసి హిట్ కొట్టాడు.
ఇవాళ బుచ్చిబాబు పుట్టిన రోజు కావడంతో హీరో రాంచరణ్, బుచ్చిబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. త్వరలోనే సెట్ లో కలుసుకుందామంటూ క్యాప్షన్ ఇచ్చాడు చెర్రీ. బుచ్చిబాబు - రాంచరణ్ కాంబోలో మైత్రీ మూవీ మేకర్స్ నుండి సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చరణ్ శంకర్ తో RC15 లో నటిస్తున్నాడు.
అయితే భారతీయుడు 2 సినిమాలో శంకర్ బిజీగా ఉండటంతో ఈ సినిమా స్లోగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే RC15 తో పాటు బుచ్చిబాబు సినిమాను తెరకెక్కించాలని, లేదంటే కొద్ది గ్యాప్ లో సినిమా ను ట్రాక్ లో పెట్టాలని రామ్ చరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 సమ్మర్ తర్వాత బుచ్చిబాబుతో రాంచరణ్ మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొదటి సినిమా ఉప్పెనతో మంచి హిట్ అందుకున్న సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు.. తన నెక్స్ట్ మూవీని ఎన్టీఆర్ తో చేయాలని చాలా కలలు కన్నాడు. వేరే హీరోలు, నిర్మాతలు బుచ్చిబాబుతో మూవీ చేయాలని ఇంట్రెస్ట్ చూపించినా తాను మాత్రం ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తూ వచ్చాడు.
అయితే ఎన్టీఆర్ - కొరటాల శివ మూవీ చాలా లేటుగా పట్టాలెక్కడంతో బుచ్చిబాబు రెండేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. అలా ఎన్టీఆర్ తో ప్రాజెక్టు మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపించాయి.
దీంతో బుచ్చిబాబు టైం వేస్టు చేయకుండా ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసిన కథలో కొన్ని మార్పులు చేసి దానిని రాంచరణ్ కు నరేట్ చేశాడు. ఈ కథ, చెప్పిన విధానం నచ్చడంతో రాంచరణ్ సినిమాను ఓకే చేశాడు. అలా రెండో సినిమాతోనే రాంచరణ్ లాంటి పాన్ ఇండియా స్టార్ ను డైరెక్ట్ చేసే అవకాశం బుచ్చిబాబుకు దక్కింది. ఈ మధ్యే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.