హాలీవుడ్ చిత్రంలా 'పౌజీ'..1940 బ్యాక్ డ్రాప్!
తాజాగా ఈ సినిమా గురించి రచయిత కృష్ణకాంత్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి లవ్ అండ్ వార్ బ్యాక్ డ్రాప్ లో 'పౌజీ' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియాలో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సీతారామం తర్వాత హను టేకప్ చేసిన ప్రాజెక్ట్ ఇది. అతడి మార్క్ లవ్ స్టోరీని హైలైట్ చేస్తూనే భారీ వార్ ఎపిక్ ని హైలైట్ తనదైన శైలిలో తీర్చిది ద్దుతున్నట్లు ప్రచారంలో ఉంది. తాజాగా ఈ సినిమా గురించి రచయిత కృష్ణకాంత్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ప్రభాస్-హను సినిమా ఎలా ఉండబోతుంది? అంటే! ఇలా స్పందించారు. కథ, కథనాల పరంగా ఈ సినిమా ఓహాలీ వుడ్ చిత్రంలా ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. గెస్ చేయని విధంగా సినిమా ఉంటుంది. ఈ కథ పూర్తిగా 1940 బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. హను శైలి లవ్ స్టోరీతో పాటు, బలమైన డ్రామా, భారీ యాక్షన్ సన్నివేశా లున్నాయి. ఇదంతా దేశ భక్తి అంశాలతో మిళితమై ఉంటుంది' అన్నారు. అంటే ఈ కథ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథ అని తేలిపోయింది. కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగానూ ఈ సినిమా తీస్తున్నట్లు తొలుత ప్రచారం జరిగింది.
తాజాగా రైటర్ క్లారిటీతో కన్పమ్ అయింది. హను రాఘవపూడి గత సినిమా 'సీతారామం' ఓ వాస్తవ సంఘటన స్పూర్తితోనే తెరకెక్కింది. హైదరాబాద్ కోఠిలో దొరికే సెకెండ్ హ్యాండ్ పుస్తకాలను కొనుగోలు చేసే అలవాటు ఉన్న హను ఓ రోజు ఓ పుస్తకాన్ని కొనుగోలు చేసాడు. ఆ పుస్తకం చదువుతోన్న సమయంలో క్రమంలో పేజీల మధ్యలో హనుకి ఓ లేఖ కనిపించింది. ఆ లేఖ అప్పటికీ ఓ పెన్ చేసి లేదు.
హైదరాబాద్ లో చదువుకుంటోన్న ఓ విద్యార్దికి ఊర్లో ఉన్న తన తల్లి పంపించిన లేఖ అది. ఆ లేఖ స్పూర్తితో సీతారామం కథ అల్లాడు. పౌజీ కథ వెనుక ఇలాంటి చరిత్ర ఏదైనా ఉందా? అన్నది తేలాలి. పౌజీని హాలీవుడ్ రేంజ్ లో తీస్తున్నాడంటే? ఇది భారీ స్పాన్ ఉన్న సినిమా అని తెలుస్తోంది. హీరోయిన్ గా ఇమాన్వీ ఇస్మాయిల్ అనే ఓ కొత్త భామను తీసుకోవడం వెనుక ఇంట్రెస్టింగ్ విషయం ఉండే ఉంటుందని నెటి జనులు భావిస్తున్నారు.