కల్ట్ డైరెక్టర్ కంబ్యాక్ కోసం బిగ్ ఫైట్
ఇమ్రాన్ హష్మితో సిరీస్ 'సికందర్ కా ముకద్దర్' యావరేజ్‌గా ఆదరణ దక్కించుకుంది. అజయ్ దేవగన్‌తో 'ఔరోన్ మే కహాన్ దమ్ థా' ప్రతికూల సమీక్షలతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
కెరీర్‌లో డజను పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు నీరజ్ పాండే. జాతీయ అవార్డులు అందుకున్న కల్ట్ క్లాసిక్స్ దర్శకుడిగా అతడికి ప్రత్యేక గౌరవం ఉంది. నీరజ్ తెరకెక్కించిన 'ఏ వెడ్నెస్ డే'(ఈనాడు)లో విక్టరీ వెంకటేష్, కమల్ హాసన్ లాంటి స్టార్లు నటించారు. తెలుగులోను ఈ సినిమా ఆదరణ దక్కించుకుంది. నీరజ్ బ్రాండ్ క్లాసిక్ 'స్పెషల్ ఓపీఎస్' వెబ్ సిరీస్ ఓటీటీలో గొప్పగా ఆకట్టుకుంది.
అందుకే నీరజ్ పాండే ఓ సినిమా లేదా వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారంటే ఆడియెన్‌లో ఒకటే క్యూరియాసిటీ నెలకొంటుంది. అతడు ఏదైనా సామాజిక ఇతివృత్తాన్ని లేదా ఏదైనా సంఘంలో పెద్ద సమస్యను తన సినిమా కథలో టచ్ చేస్తాడని, అద్భుతమైన సందేశంతో ఆకట్టుకుంటాడని కూడా అభిమానులు ఆశిస్తారు.
ఇమ్రాన్ హష్మితో సిరీస్ 'సికందర్ కా ముకద్దర్' యావరేజ్‌గా ఆదరణ దక్కించుకుంది. అజయ్ దేవగన్‌తో 'ఔరోన్ మే కహాన్ దమ్ థా' ప్రతికూల సమీక్షలతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే అన్నిటి నుంచి బయటపడేందుకు 2025 వెబ్ సిరీస్ ది బిగ్గెస్ట్ షో ఆఫ్ 2025 పేరుతో నీరజ్ అలరించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ కొత్త సిరీస్ ప్రకటనపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. నీరజ్ మరోసారి తనదైన స్టోరి టెల్లింగ్ అద్భుత నేరేషన్ తో ఆకట్టుకుంటాడని భావిస్తున్నారు. కొన్ని వరుస ప్రాజెక్టులు నిరాశపరిచాయి గనుక ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుని తాజా వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నామని అతడు చెబుతున్నాడు. నీరజ్ చెబుతున్న దానిని బట్టి దీనికోసం అతడు సర్వశక్తులు ఒడ్డి ఈ ప్రాజెక్టును సక్సెస్ చేసేందుకు పని చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి.