'అప్ప‌న్న' గురించి మెగా మేన‌ల్లుడి మ‌న‌సులో మాట‌!

ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో మెగా మేన‌ల్లుడు సాయిదుర్గ తేజ్ కూడా వ‌చ్చాడు.

Update: 2025-01-10 11:17 GMT

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన 'గేమ్ ఛేంజ‌ర్' నేడు భారీ అంచ‌నాల మ‌ధ్య‌ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈ సినిమా అంచ‌నాలు అందుకుందా? లేదా? అన్న‌ది త‌ర్వాత సంగ‌తి! అయితే సినిమా లో 'అప్ప‌న్న' పాత్ర మాత్రం ఓ రేంజ్ లో పండింద‌న్న‌ది అంద‌రి నుంచి వినిపిస్తోన్న మాట‌. ఆ పాత్ర‌ను శంక‌ర్ మ‌లిచిన తీరుకు అంతా శెభాష్ అంటున్నారు. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో మెగా మేన‌ల్లుడు సాయిదుర్గ తేజ్ కూడా వ‌చ్చాడు.

ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ నుంచి అత‌డికి న‌చ్చిన కొన్ని పాత్ర‌ల‌ను తీసుకుని ఆకాశానికి ఎత్తేసాడు. 'మ‌గ‌ధీర‌'లోని హ‌ర్ష‌, కాల‌భైర‌వ పాత్ర‌లు మొద‌టి స్థానంలో ఉంటే? 'ఆరెంజ్' చిత్రంలోని రామ్ పాత్ర త‌న‌ని అంతే ఆక‌ట్టుకుంద‌న్నాడు. అలాగే 'రంగ‌స్థ‌లం'లోని చిట్టిబాబు పాత్ర‌కు మూడ‌వ స్థానం ఇచ్చాడు. ' ఆర్ ఆర్ఆ ర్' చిత్రంలోని అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌కు నాల్గ‌వ స్థానం క‌ల్పించాడు. మ‌రి 'అప్ప‌న్న' పాత్ర స్థానం ఏంటి? అంటే నెంబ‌వ‌ర్ 5గా క‌ని పిస్తుంది.

ఇందులో ఎలాంటి డౌట్ లేదు అంటూ ఇలా రాసుకొచ్చాడు. అప్ప‌న్న పాత్ర‌కు జీవం పోయ‌డంలో మీ అంకిత భావానికి, నిబ‌ద్ద‌త‌కు ధ‌న్య‌వాదాలు. ఆ పాత్ర‌లో మీ న‌ట‌న‌ను చూడ‌టం ఓ క‌ల‌లా అనిపించింది. అప్ప‌న్న పాత్ర నుంచి ఎన్నో విష‌యాలు తీసుకోవ‌చ్చు. ఆ పాత్ర‌తో పూర్తి స్థాయి పరిణతి చెందిన నటుడిగా ఎదిగారు. శంక‌ర్ ఆ పాత్ర‌ను ఎంత‌లా న‌మ్మి తీసారా? అంత‌కు మించి జీవం పోసి మెప్పించారు' అని రాసుకొచ్చారు.

ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. మెగా అభిమానుల్ని ఆక‌ట్టుకుంటున్న పోస్ట్ గా మారింది. ప్ర‌స్తుతం సాయిదుర్గ తేజ్ 'సంబ‌రాల ఏటిగ‌ట్టు' సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆన్ సెట్స్ లో ఉందీ చిత్రం. 'విరూపాక్ష' త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకుని ప‌ట్టాలెక్కించిన ప్రాజెక్ట్ ఇది. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని ఇదే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Tags:    

Similar News