'కేజీఎఫ్ 2' సక్సెస్ తో సలార్ లో ఆ సన్నివేశం బడ్జెట్ రెట్టింపు చేశారట!
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమా చిత్రీకరణ 30 శాతం వరకు పూర్తి అయ్యింది. సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యి చాలా అయ్యింది. కాని కరోనా ఇతర కారణాల వల్ల సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా మళ్లీ పట్టాలెక్కించేందుకు దర్శకుడు సిద్దం అయ్యాడు. కేజీఎఫ్ 2 సినిమా సక్సెస్ అవ్వడంతో సలార్ సినిమా ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు.
కేజీఎఫ్ 1 సినిమాను మించిన విజయాన్ని కేజీఎఫ్ 2 సినిమా దక్కించుకుంది. వసూళ్ల విషయంలో రాజమౌళి సినిమా కు కాస్త అటు ఇటుగా అన్నట్లుగా కేజీఎఫ్ 2 రాబట్టింది. ఇంతటి వసూళ్ల నమోదు కావడంతో సలార్ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ప్రభాస్ అభిమానులు సలార్ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తి అవుతుంది... విడుదల అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు.
ఇక సలార్ లోని ప్రీ క్లైమాక్స్ సన్నివేశాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేశారు. మొదట్లో ఆ సన్నివేశంకు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో పది కోట్లు ఖర్చు చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడు.
కాని ఇప్పుడు కేజీఎఫ్ 2 సినిమా సూపర్ హిట్ అయ్యి భారీ వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యంలో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు అనే ఉద్దేశ్యంతో ఏకంగా 20 కోట్ల రూపాయలను ఆ ఒక్క ప్రీ క్లైమాక్స్ సన్నివేశానికి ఖర్చు చేయబోతున్నారట.
సలార్ సినిమా లోని ప్రతి సన్నివేశం కూడా భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఉంటాయని అంటున్నారు. రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అనే ఉద్దేశ్యంతో సలార్ ను కూడా భారీ మొత్తంలో ఖర్చు చేసి నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ 2 ను నిర్మించిన హంబుల్ సంస్థ ప్రస్తుతం సలార్ ను నిర్మిస్తుంది. కనుక బడ్జెట్ విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా లో శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించబోతుంది. కన్నడ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో హీరోయిన్ పాత్ర చనిపోతుందట. దాంతో సినిమా కాస్త సాడ్ ఎండ్ ను కలిగి ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ మరియు శృతి హాసన్ ల మద్య సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.