తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరు ఎలా వెళుతున్నా తన దారి మాత్రం సపరేట్ అంటాడు లవర్ బాయ్ రామ్. ఎక్కువగా అమ్మాయిలకు ఫెవేరేట్ హీరో అయిన రామ్ కెరీర్ లో సక్సెస్ రేట్ ని పెంచుకోలేదు గాని స్టార్ డమ్ ని మాత్రం బాగానే పెంచుకున్నాడు. ఎప్పుడు వస్తున్నాడో లేదో కూడా తెలియకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. మొదటి సారి ఈ హీరో సినిమాకు ఓ ఇబ్బంది వచ్చి పడింది.
రామ్ ఎక్కువగా తన సొంత ప్రొడక్షన్ స్రవంతి మూవీస్ లోనే సినిమాలు చేస్తుంటాడు. అయితే ఈ సారి రామ్ సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాత స్రవంతి రవి కిషోర్ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. గరుడవేగ దర్శకుడు ప్రవీణ్ సత్తారు ప్రాజెక్ట్ కి రామ్ ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఎప్పుడు లేని విధంగా సరికొత్త యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ గా తెరకెక్కించాలని దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు. కాన్సెప్ట్ నచ్చడంతో రామ్ సింగిల్ సిట్టింగ్ లో ఒకే చేశాడు. స్రవంతి రవికిషోర్ గారికి కూడా ముందే నచ్చింది.
కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు వద్దే సినిమాకు బ్రేకులు పడుతున్నాయి. రామ్ మార్కెట్ కి తగ్గట్టు లెక్కలు వేసుకుంటే సినిమా బడ్జెట్ చాలా ఎక్కువవుతోందట. అసలే దర్శకుడు ప్రవీణ్ సినిమా కాస్ట్ లీ కోసమని మధ్యలో బడ్జెట్ పెంచమని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గరుడవేగ సినిమా ముందు ఒక బడ్జెట్ అనుకోగా తరువాత అది మరింత పెరిగింది. ఇప్పుడు రామ్ సినిమా విషయంలో కూడా అదే జరగవచ్చనే అనుమానం లేకపోలేదు. అయినా రవికిశోర్ సీనియర్ ప్రొడ్యూసర్ కావున దేనికి ఎంత అవుతుందని ఓ లెక్క వేసుకోగలరు. చూస్తుంటే బడ్జెట్ పెరగడంతో సందిగ్ధంలో పడ్డారని టాక్.. మరి చిత్ర యూనిట్ ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.