మెగా మేన‌ల్లుడికి ఇదొక పంచ్‌

Update: 2015-09-23 13:30 GMT
మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా  హ‌రీష్ శంక‌ర్ దర్శకత్వం లో సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ ఈ గురువారం రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. వీకెండ్ నాలుగు రోజులు అంటే గురు - శుక్ర‌ - శ‌ని - ఆది వారాలు క‌లెక్ష‌న్లు దుమ్ము రేపేస్తాయ‌ని ప్లాన్ వేశారు నిర్మాత దిల్‌రాజు. పైగా 24న‌ బ‌క్రీద్ సెల‌వు కాబ‌ట్టి ముందుగా టిక్కెట్లు ఆన్‌ లైన్‌ లో బుక్ చేసుకునేవారికి వీల‌వుతుంది. గురువారం ఉద‌యం ప్రీమియ‌ర్ షోల రూపంలో భారీ మొత్తాల్ని జేబులో వేసుకునే ఛాన్సుంద‌ని అనుకున్నారు. అందుకే రెగ్యుల‌ర్‌గా శుక్ర‌వారం రిలీజ్ కాకుండా ఓ రోజు ముందే రిలీజ్ ప్లాన్ చేసింది. కానీ చ‌వ‌రి నిమిషంలో రాజుగారి ప్లాన్ రివ‌ర్స‌య్యింది. ప్ర‌భుత్వం ఇచ్చిన పంచ్‌ కి దిమ్మ‌తిరిగిపోయింది. ఇంకాస్త డీటెయిల్స్‌ లోకి వెళితే...

కొద్ది రోజుల క్రితం ప్ర‌భుత్వం బ‌క్రీద్ సెల‌వు సెప్టెంబ‌ర్ 24 అంటూ ప్ర‌క‌టించింది. ఆ మేర‌కు మంగ‌ళ‌వారం నుంచే టిక్కెట్ల కొనుగోళ్లు మొద‌లై బుధ‌వారం సెల‌వు రోజున ఆన్‌ లైన్ టికెటింగ్ బావుంటుంద‌ని భావించారు. గురువారం ఉద‌యం 8.45  షోకి థియేట‌ర్ హౌస్‌ ఫుల్స్ అవుతాయ‌ని అంచ‌నావేశారు దిల్‌ రాజు. అయితే చివ‌రి నిమిషంలో ప్ర‌భుత్వం పంచ్ ఇచ్చింది. బ‌క్రీద్ సెల‌వు 24 న కాదు 25 (శుక్రవారం) అంటూ స‌వ‌ర‌ణ తేదీని ప్ర‌క‌టించింది. ఆ మేర‌కు గురువారం కన్‌ ఫామ్‌ అయిన రిలీజ్‌ కు మరి పంచ్ ప‌డింది. హైద‌రాబాద్‌లోని ఓ మ‌ల్టీప్లెక్స్‌లో  400 పైగా సీట్ల‌కు గాను కేవ‌లం 60 టిక్కెట్లే బుక్క‌య్యాయంటే  ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు.

సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ గురువారం రిలీజ‌వుతున్నా.. ఎక్కువమంది ఆఫీస్‌ బాబులూ, కాలీజీ రాజాలు వచ్చే ఛాన్సు లేదు. ఆ రోజు సెల‌వు కాదు  కాబ‌ట్టి  ఆఫీస్‌ కి వెళ్లాల్సిందే, కాలేజీకి పోవాల్సిందే. ఆ మేరకు మెగా మేన‌ల్లుడికి పంచ్ ప‌డింది. వ‌సూళ్ల‌పై తీవ్ర‌మైన ప్ర‌భావం ప‌డిన‌ట్టే. ఎందుకంటే గురువారం కలెక్షన్లు తగ్గి, సినిమాకు ఏ మాత్రం యావరేజ్‌ టాక్‌ వచ్చినా శక్ర - శని - ఆది బుకింగ్స్‌ పై ప్రభావం ఉంటుంది.
Tags:    

Similar News