బన్నీ భలే ప్లాన్ వేశాడే..!

Update: 2021-01-22 11:30 GMT
స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్‌ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కాంబినేషన్ లో 'పుష్ప' అనే మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌ గా డీ గ్లామర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే లేటెస్టుగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం 'పుష్ప' సినిమా విడుదల విషయంలో అల్లు అర్జున్ నిర్ణయాన్ని మార్చుకున్నాడని తెలుస్తోంది.

అల్లు అర్జున్ కి 'అల వైకుంఠపురంలో' సినిమాతో వచ్చిన క్రేజ్ దృష్టిలో పెట్టుకొని 'పుష్ప' చిత్రాన్ని కేవలం ఐదు భాషలకే పరిమితం చేయకుండా.. మొత్తం పది భారతీయ భాషల్లో రిలీజ్ చేయాలని బన్నీ అండ్ టీమ్ ఆలోచిస్తోందట. అందుకే దీనికి తగ్గట్టే నటీనటుల ఎంపిక జరుగుతోందని సమాచారం. ఈ మధ్య తెలుగు సినిమాలను వివిధ ఇతర భాషల్లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ పోతినేని నటించిన 'రెడ్' చిత్రాన్ని 8 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నారు. అలానే 'ఆర్.ఆర్.ఆర్' 'రాధే శ్యామ్' వంటి సినిమాలను కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా రూపొందిస్తున్నారు. ఇక 'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని చూస్తున్నాడు.
Tags:    

Similar News