ఇటీవల కాలంలో అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప సినిమా తో పాటు ఐకాన్ సినిమా గురించి మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. పుష్ప రెండు పార్ట్ లు గా విడుదల కాబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. మొదటి పార్ట్ ఈ ఏడాదిలోనే విడుదల కాబోతుంది. ఇక రెండు పార్ట్ ల మద్య ఐకాన్ సినిమా ఉంటుందని అల్లు అర్జున్ ఆప్తుడు.. నిర్మాత అయిన బన్నీ వాసు చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఐకాన్ సినిమా కు సంబంధించిన చర్చలు మూడు సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఐకాన్ సినిమా కోసం దర్శకుడు వేణు శ్రీరామ్ వెయిట్ చేసి చేసి పవన్ కళ్యాణ్ తో వచ్చిన అవకాశం ను వకీల్ సాబ్ గా సద్వినియోగం చేసుకున్నాడు.
వకీల్ సాబ్ సినిమా సక్సెస్ అవ్వడంతో బన్నీ కి ఆయనపై నమ్మకం ఏర్పడినట్లుగా వార్తలు వచ్చాయి. దిల్ రాజు ఇదే సమయం గా భావించి ఐకాన్ సినిమా ను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప మొదటి పార్ట్ ను ఆగస్టు కు పూర్తి చేసి వెంటనే ఐకాన్ సినిమాను మొదలు పెట్టి మూడు నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలని బన్నీ భావిస్తున్నాడట. అల్లు అర్జున్ ఐకాన్ మూవీకి సుకుమార్ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. బన్నీ ఐకాన్ మూవీ దాదాపుగా కన్ఫర్మ్ అయ్యిందనే వార్తలు జోరుగా వస్తున్న ఈ సమయంలో మరో విషయం కూడా చర్చకు వస్తోంది.
వకీల్ సాబ్ సినిమా విడుదల తర్వాత నిర్మాత దిల్ రాజు పై దర్శకుడు వేణు శ్రీరామ్ కోపంగా ఉన్నాడని.. పారితోషికం విషయంలో తనకు తీరని అన్యాయం చేశాడు అంటూ దిల్ రాజు పై కోపంగా దర్శకుడు ఉన్నాడంటూ మీడియాలో కథనాలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. గత పుష్కర కాలంగా దిల్ రాజు క్యాంప్ లో ఉన్న దర్శకుడు వేణు శ్రీరామ్ కొత్త నిర్మాతను కలిసి కథ లు వినిపించాడని.. త్వరలోనే మరో బ్యానర్ లో ఈయన సినిమా ఉంటుందని ఆమద్య వార్తలు వచ్చాయి.
దిల్ రాజు తో విభేదాల గురించి దర్శకుడు వేణు శ్రీరామ్ బహిరంగంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. అలా అని ఆ వార్తలను ఖండించలేదు. కనుక ఇద్దరి మద్య ఏదో చిన్న పాటి క్లాష్ అయితే ఉందని ఇండస్ట్రీలో కూడా టాక్ వినిపించింది. దిల్ రాజు ఐకాన్ సినిమా కు కూడా పారితోషికం మాదిరిగా కాకుండా నెల వారి జీతం చొప్పున ఇస్తానని ఉంటాడని అందుకే వేణు శ్రీరామ్ కు కోపం వచ్చి ఉంటుందని కొందరి అభిప్రాయం. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు అల్లు అర్జున్ ఐకాన్ సినిమా కు రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ ఐకాన్ సినిమా దిల్ రాజు నిర్మాణం లో వేణు శ్రీరామ్ దర్శకత్వం లో ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. ఇద్దరి మద్య విభేదాలు ఉన్నప్పుడు ఎలా ఐకాన్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఐకాన్ సినిమా మీడియాలో ఇన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారంకు బ్రేక్ వేసే అవకాశం ఉందేమో చూడాలి. ఐకాన్ మూవీ కనుక పట్టాలెక్కితే దిల్ రాజుకు మరియు దర్శకుడు వేణు శ్రీరామ్ కు మద్య ఎలాంటి గొడవలు లేనట్లే అంటూ మీడియా సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఐకాన్ సినిమా కోసం వకీల్ సాబ్ మూవీ కి ముందు వేణు శ్రీరామ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాడు. కాని ఇప్పుడు ఆయన లో ఆ ఆసక్తి ఉందా అనేది కొందరి అనుమానం. మొత్తానికి బన్నీ ఐకాన్ సినిమా చేసేందుకు సిద్దంగా ఉన్నా వేణు శ్రీరామ్ మరియు దిల్ రాజు ల మద్య ఉన్న విభేదాల పరిస్థితి ఏంటీ అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.