ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులు ఎప్పుడూ లేని విధంగా కొత్త వివాదానికి దారి తీశాయి. టోటల్ గా మెగా ఫ్యామిలీనే సైడ్ చేస్తున్నారంటూ ఈసారి మెగా క్యాంప్ నుంచి నిరసన స్వరం గట్టిగా వినిపించింది. నంది అవార్డులు రావాలంటే మెగా హీరోలంతా టీడీపీ గవర్నమెంట్ దగ్గర యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకోవాలంటూ మెగా ఫ్యామిలీకి సన్నిహితుడైన బన్నీ వాస్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది.
బన్నీ వాస్ పెట్టిన పోస్ట్ వివాదాస్పదంగా మారడంతో దానిపై ఆయనే ఓ ఛానల్ తో మాట్లాడుతూ అది పెట్టడం వెనుక తన ఫీలింగ్ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం సినిమా సూపర్ హిట్టయినా కమర్షియల్ సినిమా పేరు చెప్పి ఏ ఒక్క కేటగిరీలోనూ అవార్డ్ ఇవ్వలేదన్నారు. కానీ అదే ఏడాది అవార్డొచ్చిన సినిమాల్లో అత్యధికం కమర్షియల్ సినిమాలేనన్నాడు. గతంలో మగధీర - గబ్బర్ సింగ్ సినిమాలకూ ఇలాంటి అన్యాయమే జరిగిందన్నాడు. ఎవరూ నోరెత్తడం లేదు కాబట్టి అవార్డుల విషయంలో అన్యాయం చేస్తున్నారని అనిపించడం వల్లనే తాను ప్రశ్నిస్తున్నానని బన్నీ వాస్ చెప్పుకొచ్చాడు.
సినిమా ఇండస్ట్రీ రెవెన్యూ 100 రూపాయలు అనుకుంటే బాహుబలి మినహాయించి మెగా ఫ్యామిలీ షేర్ 50 పర్సెంట్ ఉంటుందనేది బన్నీ వాస్ లెక్క. సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల్లోనూ ఈ స్థాయికి తగిన ప్రాధాన్యం ఎప్పుడూ మెగా ఫ్యామిలీకి రాలేదనే అంటున్నారు. అంతా బాగానే ఉంది.. గొప్ప నటనకు రావాల్సిన అవార్డులను డబ్బుల లెక్కల నుంచి చూడటమే కాస్త ఇబ్బందికరంగా ఉంది.