16 ఏళ్ల క్రితం వచ్చిన బంటీ ఔర్ బబ్లీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అమితాబచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ లు ప్రథాన పాత్రల్లో నటించిన ఆ సినిమా లో రాణి ముఖర్జీ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. బంటీ ఔర్ బబ్లీ సినిమాకు ఇన్నాళ్లకు పార్ట్ 2 వచ్చింది. రాణి ముఖర్జీ పార్ట్ 2 లో కంటిన్యూ అవ్వగా హీరోలుగా బచ్చన్ లు కాకుండా సైఫ్ అలీ ఖాన్ మరియు యంగ్ హీరో సిద్దార్థ్ చతుర్వేది లు నటించారు. 2019 లో ఈ సినిమా ను మొదలు పెట్టారు. గత ఏడాదిలోనే సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఈ ఏడాది కూడా వస్తుందా లేదా అనే అనుమానాల మద్య ఇటీవలే ఉత్తరాదిన థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వడంతో విడుదల చేశారు.
నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు నిరాశ తప్పలేదు. బ్యాడ్ రివ్యూలతో పాటు ప్రేక్షకుల బ్యాడ్ ఫీడ్ బ్యాక్ వల్ల సినిమా వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఏడాది కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నది ఈ సినిమా కోసమా అంటూ చాలా మంది పెదవి విరుస్తున్నారు. అబ్బే అంటూ వారు అసహనంతో ఉన్నారు. మొత్తానికి బంటీ ఔర్ బబ్లీ 2 సినిమా కు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. గత వారం వచ్చిన సూర్యవంశీ నే మరో వారం రోజుల పాటు బాలీవుడ్ బాక్సాఫీస్ ను ఏళబోతున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చాలా కాలం తర్వాత సైఫ్ అలీ ఖాన్ మరియు రాణి ముఖర్జీ నటించడంతో వారి కాంబో అభిమానులు అంచనాలు పెంచుకున్నారు. అలాగే బంటీ ఔర్ బబ్లీ సినిమా ను గతంలో చూసిన వారు ఈ సినిమా పై ఆసక్తిని కనబర్చారు. తీరా సినిమా విడుదల తర్వాత మొదటి పార్ట్ కు రెండవ పార్ట్ కు సంబందం లేనట్లుగానే ఉంది. ఏ పార్ట్ కు ఆ పార్ట్ అన్నట్లుగా ఉందంటూ టాక్ వచ్చింది. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ఈ సినిమా చూడాలనుకుంటే మాత్రం తీవ్ర నిరాశ తప్పదు అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులు గత 20 నెలలుగా సినిమాలు లేక మొహం మొత్తం ఉన్నారు. అయినా కూడా ఈ సినిమాను వారు స్వీకరించేందుకు ఆసక్తి చూపడం లేదంటూ బాలీవుడ్ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.