బాలీవుడ్ లో అభిషేక్ బచ్చన్..రాణీ ముఖర్జీ జంటగా తెరకెక్కిన తెరకెక్కిన `బంటీ బబ్లీ` కామెండీ ఎంటర్ టైనర్ అప్పట్లో ఎలాంటి విజయంసాధించిందో తెలిసిందే. అభిషేక్ కెరీర్ లో అత్యుత్తమ చిత్రాలలో ఇదొకటిగా నిలిచింది. తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్ గా `బంటీ ఔర్ బబ్లీ -2` తెరకెక్కుతోంది. ఇందులో అభిషేక్ స్థానంలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. రాణీ ముఖర్జీ యధావిధిగా పార్టు 2 లోనూ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సిద్ధార్థ్ చతుర్వేద్..శర్వారీ వాగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు 17 సంవత్సరాల తర్వాత ఈ సీక్వెల్ తెరకెక్కడతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడుతున్నాయి.
తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. నాలుగు పాత్రల చుట్టూ చక్కని కామెడీని పండించినట్లు తెలుస్తోంది. రాణీ ముఖర్జీ ఫ్యాషన్ క్వీన్ఆఫ్ పుర్సత్ గంజ్ అని పిలవగా..బంటి త పని మానేసి బరవు పెరిగే పనిలో బిజీగా ఉంటాడు. బంటి ఇందులో రైల్వే టిక్కెట్ కలెక్టర్ పాత్ర పోషిస్తున్నాడు. వారు చేస్తోన్న మోసాల ద్వారా ఈ జంట ఎలా తమ ప్రశాంతతని కోల్పోయారు? అన్నది ఆద్యంతం కామెడీ ట్రాక్ లో ఆకట్టుకుంటుంది. ప్రోస్తెటిక్స్ మేకప్ ఈ పాత్రలకు సరిగ్గా సరిపోయింది. సైఫ్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. సహజంగానే సైఫ్ లో మంచి కామెడీ ఉంది. ఇలాంటి పాత్రలు దొరికితే సైఫ్ పెర్పామెన్స్ పీక్స్ లో నే ఉంటుంది. దీంతో సినిమాపై అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి.
ఈ చిత్రానికి `టైగర్ జిందా హై`కి అసిస్టెంట్ గా పనిచేసిన వరుణ్ వి శర్మ దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా నవంబర్ 2న చిత్రం రిలీజ్ అవుతుంది. మొదటి పార్టు లానే రెండవ భాగం కూడా భారీ విజయం సాధిస్తుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. బాలీవుడ్ లో సీక్వెల్స్ ఫెయిలైన సందర్భాలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఆ సెంటిమెంట్ `బంటీ ఔర్ బబ్లీ-2`కి వర్కౌట్ అవుతుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.
Full View