మాటల రచయితగా చాలా త్వరగా గొప్ప పేరు సంపాదించాడు సాయిమాధవ్ బుర్రా. ‘కృష్ణం వందే జగద్గురుం’.. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’.. ‘కంచె’.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి సినిమాలు ఆయన మాటల గాఢతను తెలియజేస్తాయి. తాజాగా ఆయన ‘మహానటి’ సినిమాతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇందులో చెప్పుకోవడానికి ఆణిముత్యాల్లాంటి మాటలు చాలానే ఉన్నాయి. ‘ఒక కథ తెలుసుకుందామని వెళ్లా. కానీ ఒక చరిత్ర తెలుసుకున్నా’’.. ‘‘ప్రతిభ ఇంటిపట్టున ఉండిపోతే పుట్టగతులు ఉండవు’’.. లాంటి లోతైన మాటలు బుర్రా ప్రత్యేకతను చాటి చెబుతాయి. తన పాండిత్యం చూపించాలని చూడకుండా సన్నివేశానికి అవసరమైన మేరకు కొలిచినట్లు.. మనసును హత్తుకునేలా మాటలు రాయడం బుర్రా ప్రత్యేకత.
‘మహానటి’తో మరోసారి తనదైన ముద్ర వేసిన బుర్రా... ఈ చిత్రానికి మాటలు రాస్తూ తాను పలుమార్లు భావోద్వేగానికి గురయ్యానని చెప్పాడు. ఆ అనుభవం గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నాకు కష్టాలు ఎదురైనపుడు కన్నీళ్లు రావు. ఒక మంచి సినిమా చూసినపుడు.. ఒక మంచి సీన్ చూసినపుడు కన్నీళ్లు వస్తుంటాయి. ‘మహానటి’ సినిమాకు మాటలు రాస్తున్నపుడు నేను కొన్ని పాత్రల లోతుల్లోకి వెళ్లిపోవడం జరుగుతుండేది. ముఖ్యంగా సావిత్రి పాత్రకు మాటలు రాయాలంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్లి ఆమె ఎలా స్పందించేదో ఊహించుకుని రాయాల్సి ఉంటుంద.ి అలా సావిత్రి గారిలా ఆలోచించే క్రమంతలో చాలాసార్లు నాకు తెలియకుండానే కళ్ల వెంట నీళ్లు వచ్చేవి. ఆ కన్నీళ్లతో పేపర్లు కూడా తడిసిపోయేవి’’ అని చెప్పాడు.