బుట్టబొమ్మ అనే చిన్న సినిమా టీజర్ సోమవారం రిలీజైంది. ఇది సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్లో తెరకెక్కిన సినిమా. ఇందులో త్రివిక్రమ్ సంస్త ఫ్యార్చ్యూన్ 4 కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంది. సోమవారం త్రివిక్రమ్ పుట్టిన రోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని టీజర్ లాంచ్ చేశారు. ఐతే ఈ సినిమా మొదలైనదగ్గర్నుంచి పెద్దగా బజ్ లేదు.
పైగా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించాల్సిన సిద్ధు జొన్నలగడ్డ దీన్నుంచి తప్పుకున్నాడు. అతను ఈ చిత్రంలో కొనసాగి ఉంటే ‘డీజే టిల్లు’ తర్వాత వచ్చిన సినిమా కాబట్టి హైప్ వచ్చేది. కానీ మారిన తన ఇమేజ్‌కు ఈ సినిమా చేయడం కరెక్ట్ కాదని అతను తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో త్రివిక్రమ్ దగ్గర చాలా కాలంగా కోడైరెక్టర్‌గా పని చేస్తున్న వ్యక్తి కొడుకుని ఆ పాత్రకు తీసుకున్నారు.
ఐతే ఈ నటుడు టీజర్లో సోసోగా కనిపించాడు. మరోవైపు ఇందులో హీరోయిన్‌గా నటించిన అనైక తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. ఇటీవల ‘ఘోస్ట్’లో హీరో మేనకోడలిగా నటించింది కానీ.. అది పెద్దగా ఇంపాక్ట్ వేయలేదు. మరోవైపు ఈ సినిమాలో మూడో ముఖ్య పాత్ర పోషించిన అర్జున్ దాస్ కూడా మన వాడు కాదు. తమిళ అనువాదాల ద్వారా కొంత పరిచయం ఉన్నా కానీ.. మనవాళ్లు ఓన్ చేసుకునే రేంజ్ కాదు. ముగ్గురు ప్రధాన పాత్రధారుల్లో ఎవరూ ఫెమిలియర్ కాకపోవడం, ఎవరికీ ఇమేజ్ లేకపోవడం మైనస్.
ఈ చిత్రం మలయాళ హిట్ ‘కప్పెలా’కు రీమేక్. అదొక విభిన్నమైన సినిమా. మంచి కథతో తెరకెక్కింది. సినిమాలో, ముఖ్యంగా చివర్లో మంచి ట్విస్టులుంటాయి. కానీ కథ బాగున్నా సరే.. ఈ రోజుల్లో సినిమాకు సంబంధించి ఏదో ఒక ఆకర్షణ, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ముందు ప్రేక్షకులను ఆకర్షించాలి. వారిని థియేటర్లకు రప్పించాలి.
కానీ సినిమాకు అవే మిస్ అయినట్లున్నాయి. ఈ సినిమాలోని ట్విస్టుల్ని ముందే వెల్లడిస్తే సినిమా చూడాలన్న ఆసక్తే ఉండదు. ఆర్టిస్టుల పరంగా ఆకర్షణ ఉండుంటే వాళ్లు థియేటర్లకు ప్రేక్షకులను ఆకర్షించేవారు. తర్వాత సినిమా ఎలాగూ మెప్పించేది. కానీ ఆ ఆకర్షణ లేని నేపథ్యంలో సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం దక్కుతుందో చూాడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.