ఆసక్తికరంగా 'బుట్టబొమ్మ' టీజర్..!

Update: 2022-11-07 06:33 GMT
ఇటీవల కాలంలో వైవిధ్యమైన చిత్రాలను వరుస విజయాలను అందుకుంటున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్.. ఇప్పుడు ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ తో కలిసి ''బుట్టబొమ్మ'' అనే మరో ఆసక్తిరమైన గ్రిప్పింగ్ రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాని ప్రేక్షకులకు అందిస్తోంది. ఇందులో అనిక సురేంద్రన్ - 'మాస్టర్' ఫేమ్ అర్జున్ దాస్ మరియు సూర్య వశిష్ట ప్రధాన పాత్రలు పోషించారు.

"బుట్ట బొమ్మ" సినిమాతో శౌరి చంద్రశేఖర్ రమేష్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలు పెట్టారు. నేడు అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఆవిష్కరించారు.

ప్రేమ ఎప్పుడూ రెయిన్‌ బోలు మరియు బటర్ ఫ్లైస్ కాదు అంటూ వదిలిన ఈ గ్రిప్పింగ్ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. 'బుట్ట బొమ్మ' అనేది గ్రామీణ నేపథ్యంలో సాగే ఫీల్ గుడ్ ప్రేమ కథ అని తెలుస్తోంది. ఇందులో సత్య అనే అందమైన, చిలిపి అమ్మాయిగా.. రీల్స్ చేసి పాపులర్ అవ్వొచ్చనే అమాయకపు పల్లెటూరి యువతిగా అనిఖా సురేంద్రన్ పరిచయం చేయబడింది.

సత్య క్రమంగా ఫోన్ లో పరిచయమైన ఓ ఆటో డ్రైవర్‌ సూర్య వశిష్ట తో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అయితే వీరి లైఫ్ లోకి అర్జున్ దాస్ ఎంటర్ అయిన తర్వాత కథలో పరిణామాలు చోటుచేసుకున్నట్లు.. సత్య జీవితం కీలక మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. అర్జున్ దాస్ మరియు సూర్య తమ పాత్రలను సమర్ధవంతంగా పోషించారు. అర్జున్ దాస్ సీరియస్ గా కనిపిస్తే.. సూర్య అమాయకపు యువకుడిగా కనిపించాడు.

"బుట్ట బొమ్మ" టీజర్ ని బట్టి చూస్తే ప్రేమలోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ.. ఒక థ్రిల్లింగ్ డ్రామాని చూపించబోతున్నారని అర్థమవుతోంది. ఉత్కంఠను రేకెత్తిస్తోన్న ఈ వీడియో సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. గ్రిప్పింగ్ నేరేషన్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సినిమా జానర్‌ కి తగ్గట్టుగా నిర్మాణ విలువలు బాగున్నాయి. గోపీ సుందర్ సమకూర్చిన బీజీఎమ్ మరియు వంశీ పచ్చిపులుసు కెమెరా పనితనం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

మలయాళంలో ఘనవిజయం సాధించిన 'కప్పేల' సినిమా రీమేక్ గా ''బుట్ట బొమ్మ'' తెరకెక్కింది. ఇందులో నవ్య స్వామి - నర్రా శ్రీను - పమ్మి సాయి - కార్తీక్ ప్రసాద్ - వాసు ఇంటూరి - మిర్చి కిరణ్ - కంచరపాలెం కిషోర్ మరియు మధుమణి ఇతర సహాయక పాత్రలు పోషిస్తున్నారు. వివేక్ అన్నామలై ప్రొడక్షన్ డిజైన్ చేయగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యలు చూసుకున్నారు. ఈ చిత్రానికి గణేష్ రావూరి డైలాగ్స్ అందించారు.

ఎస్ నాగ వంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 'బుట్ట బొమ్మ' ను త్వరలోనే థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే 'ప్రేమమ్' 'భీమ్లా నాయక్' వంటి రీమేక్ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న సితార సంస్థ.. ఈసారి ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View

Tags:    

Similar News