అన్నం ఉడికిందో లేదో చెప్పేందుకు కంచంలోదంతా కుమ్మాల్సిన పనే లేదు. ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు ఉడికిందో లేదో చెప్పొచ్చు. అసలు అల వైకుంఠపురములో ఆడియో గురించి ఏమని చెప్పాలి? ఈసారి ఏదో ఛేంజ్ కనిపిస్తోంది. థమన్ లుక్ మారింది. బాణి మారింది. లిరిక్ మారింది. పాటల్లో టింజ్ ఎంతో ఇదిగా ఉంది. పైగా ప్రతి బాణిలో వాణి క్లారిటీగా వినిపిస్తోంది. సరిగ్గా ఇదే .. ఇదే థమన్ నుంచి ఆశించింది. ప్రతిసారీ కాపీ ట్యూన్ అంటూ తిట్టినందుకు మారాడో ఏమో కానీ.. ఈసారి మాత్రం ఆ మార్పు చాలా పక్కాగా కనిపిస్తోంది.
అల వైకుంఠపురములో మొదటి పాట `రాములో రాముల`తోనే తనదైన మ్యాజిక్ చేసిన థమన్ వరుసగా ఒక్కో పాటకు ఎంతో స్పష్టమైన ట్యూన్ కట్టి అదరహో అనిపించాడు. తాజాగా రిలీజైన బుట్టబొమ్మ సాంగ్ అంతే ఆకట్టుకుంది. ఎంతో ఆహ్లాదకరమైన ట్యూన్ తో రక్తి కట్టించాడు. ఇక ఈ ట్యూన్ లో ఒద్దికగా కుదిరిన పదాలతో లిరిసిస్ట్ మాయాజాలం వర్కవుటైంది. అంత్యప్రాసలు నియమాలు పాటించినా సింపుల్ పడికట్టు పదాలతో రసరమ్యమైన మెలోడీని రక్తి కట్టించాడు. ముఖ్యంగా రొదపెట్టే అనవసరమైన సంగీత ధ్వనులు ఎక్కడా వినిపించకపోవడం శ్రోతల అదృష్టం అనే చెప్పాలి.
తొలి నుంచి అల.. సాంగ్స్ లో ఏదో టింజ్ .. అండర్ కరెంట్ గా మైమరిపించే టోన్ వర్కవుటైంది. అది అలా అలా సాగిపోతోందనే చెప్పొచ్చు. ``ఇంతకన్నా మంచి పోలికేదీ తట్టలేదు అమ్మో.. ఈ లవ్ అన్నది బబుల్ గమ్`` అంటూ ఆరంభమే రామ జోగయ్య లిరిక్ టేకాఫ్ అదిరిపోయింది. ఆర్మాన్ మాలిక్ గానం అంతే ఒద్దికగా కుదిరింది. ప్రేమలో గొప్పతనాన్ని చాలా చక్కగానే అర్థమయ్యేలా చెప్పారు బుట్టబొమ్మకు. ఇక ట్యూన్ లో ఆహా ఓహో అనిపించే క్రియేటివిటీ లేకపోయినా వినిపించిన ట్యూన్ ని ఎంతో రసరమ్యంగా వినిపించారు థమన్ భయ్యా. ప్రతి పాటను ఎంతో రంజుగా విజువలైజ్ చేసేందుకు త్రివిక్రమాంత్రికుడు డ్యాన్స్ మాస్టర్ లతో కలిసి బాగానే గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారని అర్థమవుతోంది. ఒకవేళ 2020 సంక్రాంతికి ఒక పెద్ద ఫ్యామిలీ హిట్టు రాసి పెట్టి ఉందేమో.. మీ మీద ఒట్టు!
Full View