నాని హీరోగా సాయి పల్లవి మరియు కృతి శెట్టిలు హీరోయిన్స్ గా రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం శ్యామ్ సింగ రాయ్. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో నాని విభిన్న గెటప్ లో రూపొందిన ఈ సినిమాను డిసెంబర్ 24న విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. నాని ఈ సినిమా పై చాలా నమ్మకం గా కనిపిస్తున్నాడు. విభిన్నమైన కాన్సెప్ట్ అవ్వడంతో పాటు నాని కి నటుడిగా ఒక మంచి పాత్ర దక్కిందంటూ యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. సినిమాపై నమ్మకం తో ఏకంగా 50 కోట్ల వరకు ఖర్చు చేశారనే వార్తలు వస్తున్నాయి. సినిమా విడుదల నేపథ్యంలో ఇప్పుడా ఆ 50 కోట్లను రాబట్టేందుకు నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే సాధ్యం అయినంత వెనక్కు రాబట్టేందుకు భారీ ఎత్తున రేట్లు చెబుతున్నారని అంటున్నారు.
అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా ను భారీ మొత్తంకు అమ్మాలని నిర్మాతలు భావిస్తున్నారు. కాని బయ్యర్లు మాత్రం అంత మొత్తానికి కొనుగోలు చేయాలంటే ధైర్యం చాలక ముందుకు రావడం లేదు అనే టాక్ వినిపిస్తుంది. ఒకరు ఇద్దరు ఆసక్తిగా ఉన్నా కూడా ఈ సినిమాకు ముందు పుష్ప.. వెంటనే ఆర్ ఆర్ ఆర్ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఫలితం అటు ఇటు అయితే పరిస్థితి ఏంటీ అన్నట్లుగా ఆలోచిస్తున్నట్లుగా గుసగుసలు వినిపస్తున్నాయి. థియేట్రికల్ రైట్స్ మాత్రమే కాకుండా ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను కూడా భారీ మొత్తంకు నెట్ ఫ్లిక్స్ వారికి అమ్మేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే ఆ విషయమై మరింతగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.
ఇప్పటికే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కనుక సినిమా డబ్బింగ్ రైట్స్ తో కూడా భారీగానే మేకర్స్ ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఈ సినిమాతో నిర్మాతలు విడుదలకు ముందే సేఫ్ జోన్ లోకి వెళ్లే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారు. కాస్త అటు ఇటుగా సినిమాకు వచ్చిన బజ్ నేపథ్యంలో ఆ మొత్తం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని.. సినిమా విడుదల తర్వాత వచ్చే వసూళ్లు లాభాలు అదనం అంటూ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. నాని తో పాటు సాయి పల్లవి కూడా చాలా విభిన్నమైన గెటప్ లో ఈ సినిమాలో కనిపిస్తుంది. పూర్వ జన్మల కథ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంత వరకు అందుకుంటుంది అనేది చూడాలి.