విజయ్ దేవరకొండ మంచి కాన్సెప్ట్ లను ఎంపిక చేసుకుని సినిమాలు చేసే హీరోనే కాని సక్సెస్ ఉన్న దర్శకుల వెంట పడే హీరో కాదు అనేది అభిమానుల మాట. అందుకే టక్ జగదీష్ నిరాశ పర్చినంత మాత్రాన ఆయన శివ నిర్వానతో సినిమాను క్యాన్సిల్ చేసుకుంటాడు అని అభిమానులు భావించడం లేదు. ఖచ్చితంగా వీరిద్దరి కాంబోలో సినిమా అయితే రావడం పక్కా. కాని కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితమే వీరి కాంబో లో సినిమా కన్ఫర్మ్ అయ్యింది. ఆ సమయంలో చెప్పిన కథకు ఇప్పుడు పాన్ ఇండియా మెరుగులు అద్దాల్సిందిగా శివ నర్వానతో విజయ్ దేవరకొండ అన్నట్లుగా తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా విజయ్ దేవరకొండకు ప్రస్తుతం క్రేజ్ ఉంది. కనుక పాన్ ఇండియా స్క్రిప్ట్ కోరుకోవడం లో తప్పులేదు.
శివ నిర్వాన ప్రస్తుతం ఉన్న కథను పాన్ ఇండియా కు తగ్గట్లుగా మార్చితే విజయ్ దేవరకొండ చేస్తాడు అనడంలో సందేహం లేదు. నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో కాస్త పట్టు విడుపులు చూపించాల్సి ఉంటుంది. ఈ రెండు కనుక ఓకే అయితే విజయ్ దేవరకొండ టక్ వేసుకోవడం ఖాయం. వీరిద్దరి కాంబోలో రూపొందబోతున్న సినిమాను ఒక డీసెంట్ లవ్ స్టోరీతో తెరకెక్కించేలా ప్లాన్ చేశారట. కరోనా కారణంగా ఆలస్యం అయ్యిందే కాని లేదంటే ఇప్పటి వరకు వీరిద్దరి కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. హీరో విజయ్ దేవరకొండ కెరీర్ ఆరంభం నుండి చూస్తే దర్శకుల విషయంలో ప్రయోగాలు చేస్తున్నాడు. ప్రతి దర్శకుడు కూడా ఒక్క ప్లాప్ తీస్తే అతడు సినిమాలకు పనికి రాడు అన్నట్లుగా అయిపోడు. అందుకే విజయ్ దేవరకొండ కొత్త వారికి అవకాశాలు ఇవ్వడంలో ముందు ఉంటాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమాను చేస్తున్నాడు. షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ ల మీద బ్రేక్ లు వస్తున్నాయి. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. అతి త్వరలోనే సినిమా కు గుమ్మడి కాయ కొట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో సినిమా విడుదల తేదీని లైగర్ యూనిట్ సభ్యులు ప్రకటిస్తారట. బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో కరణ్ జోహార్ తో కలిసి ఛార్మి మరియు పూరిలు నిర్మిస్తున్నారు. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా చేయబోతున్న సినిమాకు దర్శకత్వంను శివ నిర్వాన వహిస్తాడా లేదంటే సుకుమార్ రంగంలోకి దిగుతాడా అనే విషయంలో అతి త్వరలోనే స్పష్టత రాబోతుంది. విభిన్న తరహా సినిమా కావాలంటే శివ నిర్వానతో కలిసి వర్క్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి రౌడీ స్టార్ పాన్ ఇండియా ఇమేజ్ కు తగ్గ స్క్రిప్ట్ ను టక్ డైరెక్టర్ రెడీ చేసేనా చూడాలి.