బాలయ్యను కాదు రవితేజను చూడండి

Update: 2018-02-06 04:11 GMT
గత కొన్నేళ్లలో తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారింది. అందుకు తగ్గట్లే సినిమాలు కూడా మారాయి. ఇంతకుముందులాగా రొటీన్.. ఫార్ములా సినిమాలు తీస్తే నడవట్లేదు. ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు దారుణంగా తిప్పి కొడుతున్నారు. కానీ మధ్య మధ్యలో కొన్ని రొటీన్ సినిమాలు కూడా అనుకోకుండా ఆడేస్తున్నాయి. అందుకు ఆ సినిమాలు రిలీజైన టైమింగ్ కూడా కారణం కావచ్చు. ఈ సంక్రాంతికి వచ్చిన ‘జై సింహా’నే ఇందుకు ఉదాహరణ. ‘అజ్ఞాతవాసి’ అంచనాలకు తగ్గట్లు ఉండి ఉంటే ‘జై సింహా’ పనైపోయేదేమో. కానీ పవన్ సినిమాకు దారుణమైన ఫలితం రావడం దీనికి కలిసొచ్చింది. పోటీలో ఉన్న మిగతా సినిమాలు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అలా ‘జై సింహా’ ఆడేసింది.

‘జై సింహా’ను నిర్మించిన సి.కళ్యాణే ఇప్పుడు ‘ఇంటిలిజెంట్’తో వస్తున్నారు. ఇది కూడా ‘జై సింహా’ తరహాలోనే రొటీన్ ఫార్ములా సినిమాలా కనిపిస్తోంది. ఇది కూడా ‘జై సింహా’ లాగే ఆడేస్తుందన్న ధీమాతో ఉన్నాడు కళ్యాణ్. కానీ మొన్న వీకెండ్లో వచ్చిన ఫార్ములా సినిమా ‘టచ్ చేసి చూడు’ ఏమైందో ఒకసారి కళ్యాణ్ చూసుకోవాలి. రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందీ సినిమా. దీనికి పోటీగా వచ్చిన ‘ఛలో’కు పాజిటివ్ టాక్ రావడం.. అది యూత్ కు కనెక్టవడంతో ‘టచ్ చేసి చూడు’కు ఊహించని ఫలితం దక్కింది. ఇక ‘ఇంటిలిజెంట్’కు పోటీగా ‘గాయత్రి’తో పాటు యూత్ కు బాగా కనెక్టయ్యేలా ఉన్న ‘తొలి ప్రేమ’ కూడా వస్తోంది. ఈ పరిస్థితుల్లో రొటీన్ మూవీలా కనిపిస్తున్న ‘ఇంటిలిజెంట్’ ఈ పోటీని ఏమాత్రం తట్టుకుంటుందో అన్నది సందేహంగా మారింది. ఈ సినిమాపై పెట్టుబడి ఎక్కువ కూడా. మరి దీనికి ఎలాంటి టాక్ వస్తుందో.. సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
Tags:    

Similar News