తన నిర్మాణంలో పూరి జగన్నాథ్ తీస్తున్న ‘లోఫర్’ సినిమా అద్భుతం అంటున్నాడు సి.కళ్యాణ్. పూరి జగన్నాథ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘పోకిరి’ని మించి లోఫర్ ఉంటుందని కాన్ఫిడెంటుగా చెబుతున్నాడాయన. ‘‘ఇంకో ఐదు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుంది. గోవా షెడ్యూల్ తో సినిమాను దాదాపుగా పూర్తి చేశాం. ‘పోకిరి’ని మించిన కంటెంట్ ఇందులో ఉంది. కలెక్షన్ల పరంగా కూడా ‘పోకిరి’ని కచ్చితంగా మించుతుంది’’ అని కళ్యాణ్ చెప్పాడు.
పూరి జగన్నాథ్ తో సినిమా తీయడంలో ఉన్న కంఫర్ట్ ఇంకెవరితోనూ లేదంటున్నాడు కళ్యాణ్. ‘లోఫర్’ లాంటి సినిమాను తన బేనర్ లో చేసినందుకు పూరికి రుణపడి ఉంటానని.. షూటింగ్ విషయంలో తనకు ఏ ఇబ్బందీ రానివ్వకుండా అంతా పూరీనే చూసుకున్నాడని.. పూరి ఒప్పుకుంటే తాను నిర్మాతగా ఉన్నన్నాళ్లూ కంటిన్యూగా అతడితోనే సినిమాలు తీస్తానని చెబుతున్నాడు కళ్యాణ్.
‘జ్యోతిలక్ష్మీ’ సినిమాతో తొలిసారి పూరి దర్శకత్వంలో సినిమా నిర్మించాడు కళ్యాణ్. ఆ సినిమా జనాల దృష్టిలో ఫ్లాపే కానీ.. నిర్మాతగా కళ్యాణ్ కు మాత్రం ఫెయిల్యూర్ కాదు. ఆ సినిమాకు వాటాల రూపంలో కళ్యాణ్ - పూరి - ఛార్మి బాగానే జేబుల్లో వేసుకున్నారు. ఇప్పుడు ‘లోఫర్’ సినిమాను కూడా కేవలం రెండు నెలల్లో, మినిమం బడ్జెట్ తో పూర్తి చేశాడు పూరి. పెట్టుబడి మీద యాభై శాతం ఎక్కువే బిజినెస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే పూరిని వదలకుండా పట్టేసుకోవాలనుకుంటున్నాడు కళ్యాణ్.