టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితం అయిన ఐటెం బాంబ్ ముమైత్ ఖాన్ పై ట్యాక్సీ డ్రైవర్ రాఘవ రాజు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... ముమైత్ ఖాన్ హైదరాబాద్ నుండి గోవాకు ట్యాక్సీని బుక్ చేసుకుంది. నాలుగు రోజుల పాటు ఆమె మొదట మాట్లాడుకుంది. ఆ తర్వాత 8 రోజుల పాటు గోవాలో ఉండాల్సి వచ్చింది. గోవా కు వెళ్తున్న సమయంలో టోల్ గేట్లు మరియు డీజిల్ ఇలా అన్ని ఖర్చులను తానే భరించాను. ఆ మొత్తంను ఆమె చివర్లో ఇస్తుందని నేను అనుకున్నాను.
గోవాలో నాకు అకామిడేషన్ మరియు ఫుడ్ విషయంలోనూ ఆమె పట్టించుకోలేదు. సరే అన్నింటికి బిల్లు వేస్తే చివరకు ఆమె ఇస్తుందని అనుకున్నాను. కాని ఆమె మాత్రం నాకు బిల్లు ఇవ్వకుండా మోసం చేసింది. మొత్తం 8 రోజులకు గాను రూ.15 వేల రూపాయలు బిల్ అయ్యింది. కాని ఆమె మాత్రం ఇవ్వలేదని వాపోయాడు. ఈ ఘటనపై క్యాబ్ డ్రైవర్ ల అసోషియేషన్ కు తెలియజేయడం జరిగింది. వారి నిర్ణయం తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లుగా రాఘవ రాజు పేర్కొన్నాడు. ఈ విషయమై ముమైత్ ఖాన్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.