ఇప్పుడంటే టాలీవుడ్ లో కొత్త తరహా సినిమాలు.. ప్రయోగాత్మక చిత్రాలు కామన్ అయ్యాయి కానీ ఓ పదేళ్ళ క్రితం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది. అప్పట్లోనే అలాంటి సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు రవిబాబు. 'అల్లరి'.. 'అనసూయ'.. 'అవును'.. 'అమరావతి'.. 'నచ్చావులే' లాంటి డజను చిత్రాలు రూపొందించాడు. అయితే రవి బాబు లాస్ట్ సినిమా 'అదుగో' మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే పంది పిల్ల ప్రధాన పాత్రలో సినిమాను తెరకెక్కించడం మాత్రం ఒక విభిన్న ప్రయత్నమే. ఆ సినిమాకు దాదాపు రవిబాబు రెండున్నరేళ్ళ సమయం వెచ్చించాడు. అయినా ఆశించిన ఫలితం రాలేదు. 'అదుగో' ఫలితంతో నిరాశపడకుండా ఆయన తన కొత్త సినిమాను రెడీ చేస్తున్నాడు.
'ఆవిరి' టైటిల్ తో తెరకెక్కే ఈ చిత్రం ఒక థ్రిల్లర్ అని సమాచారం. ఈ సినిమాలో ఐదు పాత్రలు మాత్రమే ఉంటాయట. ఇప్పటికే ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక గ్లాస్ జాడీలో డ్యాన్స్ వేస్తున్న అమ్మాయి.. ఆ మూత తీస్తున్న పెద్ద గోర్లు ఉండే ఒక చెయ్యి డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ రెండు నెలల క్రితమే పూర్తయిందట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్పీడ్ లో సాగుతోందట. ఈ సినిమాతో విజయం సాధించాలని మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలనే ఆలోచనతో రవిబాబు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ప్రమోషన్స్ లో జోరు పెంచాలని నిర్మాతలు చూస్తున్నారట. కంటెంట్ ఉంటే చాలు.. తెలుగు ప్రేక్షకులు సినిమాను హిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రవిబాబు తన ప్రత్యేకమైన స్టైల్ లో చేసే సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఛాన్స్ ఉంటుంది. ఈ సినిమాతో రవిబాబు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో వేచి చూడాలి.