దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా బాక్సాఫీస్ వద్ద 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి.. అనేక సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. హైదరాబాద్ లో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ కూడా RRR పేరిటే ఉంది.
'బాహుబలి' ప్రాంఛైజీ తర్వాత రాజమౌళి నుంచి వచ్చిన సినిమా కావడంతో 'ఆర్.ఆర్.ఆర్' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టుగానే బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. హైదరాబాద్ లో 10.6 కోట్ల భారీ వసూళ్లతో ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్ సృష్టించింది.
అయితే 'సర్కారు వారి పాట' అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూసి నైజాంలో RRR రికార్డ్ బ్రేక్ అవుతుందని భావించారు. పరశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన SVP చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రేపు (మే 12) రిలీజ్ కాబోతున్న ఈ సినిమా హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 7.25 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
గురువారం రాత్రి వరకు మహేష్ సినిమా బుకింగ్స్ ఎంత ఫాస్టుగా ఫిల్ అయినా.. 10 కోట్ల లోపే ఉంటుంది. సో ప్రస్తుతానికి హైదరాబాద్ డే-1 అడ్వాన్స్ బుకింగ్ రికార్డ్ రాజమౌళి సినిమా పేరు మీదనే ఉంది. RRR - సర్కారు వారి పాట చిత్రాల తర్వాత KGF: చాప్టర్2 (6.56 కోట్లు) - భీమ్లానాయక్ (6.30 కోట్లు) - రాధేశ్యామ్ (6.28 కోట్లు) సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డును మళ్లీ జక్కన్న తన సినిమాతోనే బ్రేక్ చేయాల్సిందేనని ట్రేడ్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అలానే 'అవతార్ 2' వంటి అప్ కమింగ్ లార్జర్ థెన్ లైఫ్ సినిమాల్లో ఏదైనా ఈ రికార్డును బద్దలు కొట్టవచ్చని అంటున్నారు.
ఇకపోతే రాజమౌళి తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. ఇది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్. ప్రస్తుతం కేవీ విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ మీద వర్క్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.