ఒకప్పటి ఆర్జీవీని గుర్తు చేస్తాడా లేదా ఎప్పటిలా తుస్సుమనిపిస్తాడా..?

Update: 2020-08-14 12:10 GMT
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ కామెంట్ చేసినా ఓ ట్వీట్ పెట్టినా సినిమా తీసినా కూడా సంచలనమే. ఇండస్ట్రీలో ఎన్నో కొత్త ఆలోచనలు కలిగించడంతో పాటు ఎన్నో మార్పులకు కారణమయ్యాడు వర్మ. ఒకప్పుడు ఇండస్ట్రీకి కొత్తదారి చూపించిన సినిమాలు తీసి సెన్సేషనల్ డైరెక్టర్ అనిపించుకున్న ఆర్జీవీ ఇప్పుడు బూతు సినిమాల డైరెక్టర్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్న చాలామంది డైరెక్టర్స్ వర్మని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారే. అలాంటిది ఇప్పుడు వారే వర్మ క్రియేటివిటీని ప్రశ్నించే స్టేజికి దిగజారిపోయాడు. ఒకప్పుడు 'శివ' 'గాయం' 'సత్య' 'కంపెనీ' 'రంగీలా' 'సర్కార్' వంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన వర్మ నుంచి ఇప్పుడు ఆ స్థాయిలో మూవీస్ రావడం లేదు.

ఇదిలా ఉండగా వర్మ కరోనా సమయంలో కూడా వరుసగా సినిమాలు తీస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అనే ఏటీటీ స్టార్ట్ చేసి ఇప్పటికే 'క్లైమాక్స్' 'నగ్నం' 'పవర్ స్టార్' సినిమాలను విడుదల చేసారు. వీటితో పాటు 'మర్డర్' 'థ్రిల్లర్' అనే సినిమాలు కంప్లీట్ చేసి.. 'థ్రిల్లర్' సినిమాని ఈ రోజు రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసాడు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ మరణాన్ని మీడియాలో విచారిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ ఛీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామిని టార్గెట్ చేసారు వర్మ. అర్నబ్ గోస్వామి బాలీవుడ్ ఇండస్ట్రీని కావాలనే టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నాడని.. ఒకటి రెండు ఇన్సిడెంట్స్ ని తీసుకొని మొత్తం ఇండస్ట్రీకి ఆపాదిస్తున్నాడని.. అతనిపై ''అర్నబ్ - ది న్యూస్ ప్రాస్టిట్యూట్'' అనే సినిమా తీస్తున్నానని ప్రకటించారు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసిన వర్మ.. అర్నబ్ ని పోలిన వ్యక్తిని ఫస్ట్ లుక్ లో చూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. గతంలో వర్మ మీడియాని టార్గెట్ చేస్తూ 'రన్' అనే సినిమా తీసినప్పటికీ.. ఇది మాత్రం కేవలం అర్నబ్ గోస్వామి ప్రొఫెషనల్ జీవితంపై వ్యంగ్యాస్త్రంగా రూపొందిస్తున్నాడు. అందులోనూ ఇప్పటి వరకు ఆర్జీవీ టార్గెట్ చేసిన వారికంటే డిఫెరెంట్ పర్సనాలిటీ అర్నబ్ అని ఎంచుకున్నాడు. ఎందుకంటే అర్నబ్ కూడా ఆర్జీవీ వలె అన్ని విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ పబ్లిసిటీ తెచ్చుకుంటుంటారు. నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అర్నబ్ గోస్వామి చర్చా వేదికల్లో పాల్గొన్న వారిపై విరుచుకుపడుతూ.. వారిపై పైచేయి సాధించాలని చూస్తుంటాడు. ఇక ఆర్జీవీ సైతం మీడియా డిస్కషన్ లో పాల్గొంటే ఎంతమంది వచ్చి కామెంట్స్ చేస్తున్నా తనదైన శైలిలో సమాధానాలు చెప్తూ పైచేయి సాగిస్తుంటారు. అందుకే చాలా రోజులకి వర్మ కరెక్ట్ పర్సన్ ని టార్గెట్ చేసాడని అందరూ భావిస్తున్నారు.

అయితే రామ్ గోపాల్ వర్మ ఒకప్పటిలా సేన్సేనల్ సినిమాలు తీయకుండా నాసిరకం సినిమాలు తీస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. ప్రస్తుతం వర్మ తీస్తున్న ఏ సినిమా కూడా పదేళ్ల క్రిందటి వర్మను గుర్తు చేయదు. సినిమాకి ఆయన చేసే పబ్లిసిటీ కారణంగా సినిమాలో ఏదో ఉంటుందని ఊహించుకున్న ప్రేక్షకులను ప్రతిసారి నిరాశకు గురయ్యేలా చేస్తున్నాడు. మూవీ అనౌన్స్ చేసినప్పుడు ఆర్జీవీ బలమైన అంశాన్ని కథా వస్తువుగా తీసుకున్నాడు అని అందరూ భావించినప్పటికీ.. తీరా సినిమా చూస్తే ఎప్పటిలాగే తుస్సుమనిపించాడు అనే కామెంట్స్ వస్తుంటాయి. ఈ క్రమంలో ''అర్నబ్ - ది న్యూస్ ప్రాస్టిట్యూట్'' విషయంలో కూడా డిజప్పాయింట్ చేస్తాడా లేదా ఒకప్పటి రామ్ గోపాల్ వర్మను గుర్తు చేసేలా ఒక మంచి సినిమాగా మలుస్తాడా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Tags:    

Similar News