అల ముందు.. అల తర్వాత.. ప్రస్తుతం థమన్ సన్నివేశమిది. ప్రతిభావంతుడే అయినా రొటీనిటీ నుంచి బయటపడలేకపోతున్నాడని విమర్శించిన వారికి థమన్ ప్రాక్టికల్ గానే సమాధానమిచ్చాడు. అందుకోసం ఇన్నాళ్లు వేచి చూడాల్సొచ్చింది. అల వైకుంఠపురములో చిత్రంతో అతడు తన డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేసుకున్నాడు. అల చిత్రాన్ని సంక్రాంతి విన్నర్ గా నిలపడంలో మ్యూజిక్ కీలకమైన పాత్రను పోషించిందన్న ప్రశంసలు దక్కాయి. తనని విమర్శించిన నోళ్లకు థమన్ అలా చెక్ పెట్టేసాడు. ఈ సినిమాలో ఎన్ని పాటలు ఉంటే అన్నిటినీ చార్ట్ బస్టర్లుగా మలిచిన ఘనత తనకు దక్కింది.
ఇక ఇదే ఉత్సాహం లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు అతడి ఖాతాలో అరడజను పైగానే సినిమాలున్నాయి. మహేష్ నటించే 27వ సినిమాకి వంశీ పైడిపల్లితో కలిసి పని చేయనున్నాడు. అలాగే బాలకృష్ణ106 తన ఖాతాలోనే పడింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న పింక్ రీమేక్ కి థమన్ సంగీతం అందించనున్నారు. రవితేజ- క్రాక్.. కీర్తి సురేష్ -మిస్ ఇండియా.. సాయి తేజ్- సోలో బ్రతుకే సో బెటరు.. నానీ- టక్ జగదీశ్.. ఇవన్నీ థమన్ ఖాతాలోనే ఉన్నాయి.
అయితే ఒకేసారి ఇన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేయాల్సి ఉంది కాబట్టి మరోసారి మునుపటిలా రొటీన్ ట్యూన్స్ తో సరి పెడతాడా? లేక అల.. తరహాలో వరుసగా చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇస్తాడా? అన్నది చూడాలి. జోరు మీద ఉన్నప్పుడే వెంటపడతారు కాబట్టి అందరినీ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇక క్రియేటివిటీ ఏది? దూసుకెళ్లే పదునైన ట్యూన్ ఏది? అన్నది థమన్ కి పూర్తి క్లారిటీ వచ్చినట్టే కాబట్టి ఈసారి ఇంతకుముందులా చేయడనే భావిస్తున్నారంతా. ఒకేసారి డజను సినిమాలకు పని చేయాల్సి వచ్చిన రోజుల్లో ఒత్తిడి వల్ల గొప్పగా చేయలేకపోయాడేమో! ఫలానా ట్యూన్ లాగా ఉండాలని అడిగిన దర్శకనిర్మాతలకు చెత్త మ్యూజిక్ ఇచ్చి ఉండొచ్చు. అలా కాకుండా తనతో సింక్ అయ్యి దర్శక నిర్మాతలు మంచి ఔట్ పుట్ తీసుకుంటే దానికి తగ్గ ట్యూన్స్ కుదురుతాయనే భావించాల్సి ఉంటుంది. థమన్ పెరిగిన బాధ్యత ను సవ్యంగానే నిర్వర్తిస్తాడని భావిద్దాం. కాపీ ట్యూన్ అన్న బ్యాడ్ రిమార్క్ ఇకపై ఉండకూడదనే కోరుకుందాం.