త‌మ్ముడి అంత్య‌క్రియ‌ల‌కు ర‌వితేజ ఎందుకు రాలేదంటే..

Update: 2017-06-25 17:01 GMT
ప్ర‌ముఖ సినీ హీరో రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన ఉదంతంలో అంద‌రి దృష్టి కేంద్రీకృతం అయింది... అంత్య‌క్రియ‌ల‌కు ర‌వితేజ హాజ‌రుకాక‌పోవ‌డం. ప్ర‌మాదాన్ని గుర్తించిన అనంత‌రం  ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో భరత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం డెడ్ బాడీని మహాప్రస్థానానికి తరలించారు. భరత్ అంత్యక్రియలు జూబ్లిహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. అయితే ఈ కార్యక్ర‌మానికి ర‌వితేజ హాజ‌రుకాలేదు.

త‌న సోద‌రుడి క‌డ చూపున‌కు హాజ‌రుకాక‌పోవ‌డంపై స‌న్నిహితుల వ‌ద్ద ర‌వితేజ మ‌నోభావాలు పంచుకున్నారు. 30 ఏళ్లుగా త‌న సోద‌రుడితో అన్యోన్యంగా క‌లిసి ఉన్నాన‌ని, ఈ ప‌రిస్థితుల్లో భ‌ర‌త్‌ ను చూడ‌లేన‌ని స‌న్నిహితుల‌తో వ్యాఖ్యానించిన‌ట్లు స‌మాచారం. భ‌ర‌త్ త‌ల్లి సైతం మ‌హాప్ర‌స్థానానికి రాక‌పోవ‌డంతో కొంద‌రు మిత్రుల స‌మ‌క్షంలోనే అంత్య‌క్రియ‌లు పూర్త‌య్యాయి. కాగా,  పలువురు సినీ ప్రముఖులు భరత్ భౌతికకాయాన్ని సందర్శించి.. నివాళి అర్పించారు.

కాగా, శనివారం రాత్రి ఔటర్ రింగ్ రోడ్ పై భరత్ ప్రయాణిస్తున్న స్కోడా కారు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జయింది. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎయిర్‌ బెలూన్‌ తెరుచుకున్నప్పటికీ అతి వేగానికి పగిలిపోయింది. స్టీరింగ్‌ విరిగిపోయింది. స్పీడోమీటర్‌ 140 కిలోమీటర్ల పైన ఆగిపోయింది. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News