చార్లీ చాప్లీన్...ఈ పేరు తెలియని వారుండరు. ఆహ్లాదకరమైన హాస్యానికి రోల్ మోడల్ గా నిలిచిన చార్లీ చాప్లీన్ ప్రపంచ సినీచరిత్రలో ఒక సంచనం అని చెప్పాలి. అతడి జీవితంపై ఇప్పటికే ఎన్నో డాక్యుమెంటరీలు వచ్చాయి. తాజాగా మరో డాక్యుమెంటరీ రాబోతోంది. ఆయన జీవితంలో ఎవరికీ తెలియని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ఆయన మనవరాలు కార్మెన్ చాప్లిన్ ఈ డాక్యుమెంటరీని తెరపైకి తీసుకురాబోతోంది.
చాప్లీన్ జీవితంలోని మరొ కోణం అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లోనూ ఆసక్తి మొదలైంది. చాప్లీన్ కథని తొలిసారి ఆయన కుటుంబానికి చెందిన వ్యక్తి తెరపైకి తీసుకురాబోతుండటంతో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. పైగా ఈ డాక్యుమెంటరీ చిత్రానికి కథని `అనదర్ డే ఆఫ్` ఫేమ్ అమాయా రెమీరేజ్ తో కలిసి కార్మెన్ అందిస్తోంది. చాప్లిన్ జీవితానికి సంబంధించిన పాత వీడియో-ఫోటో ఫుటేజ్ ని దీనికోసం ఉపయోగించనున్నారని తెలుస్తోంది.
ఈ క్రేజీ డాక్యుమెంటరీకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభం కాబోతోంది. చాప్లిన్ జీవితంపై ఏది తీసినా.. వాటిపై ఎంకే2 సంస్థ మాత్రమే హక్కుల్ని కలిగి ఉంది. ఆ సంస్థనే తాజా డాక్యుమెంటరీని నిర్మించనుంది. చాప్లిన్ పై చాలా ఏళ్ల తరువాత డాక్యు సినిమా రాబోతోందని తెలియడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే వుంటాయని సందరు సంస్థ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ డాక్యుమెంటరీకి చాప్లిన్ ఒరిజినల్ మ్యూజిక్ ని ఉపయోగించబోతున్నారట. అది వుంటేనే ప్రేక్షకులకు ఆ ఫీల్ కలుగుతుందని మేకర్స్ భావిస్తున్నారట.