కాలం ఎంత మారుతున్నా.. కొత్త ఫ్యాషన్లు ఎన్ని ప్రపంచాన్ని ముంచెత్తుతున్నా మన చేనేత కళ గొప్పతనం ఇప్పటికీ అలాగే ఉంది. వెస్ట్రన్ వేర్ కు ఇండియన్స్ లో పెరిగిన వ్యామోహంతో చేనేత ప్రాభవం తగ్గినా ఇప్పటికీ హుందాతనానికి చేనేత ప్రతీకగానే ఉంటోంది. ఈమధ్య కాలంలో మారుతున్న కాలానికి తగ్గట్టు చేనేత కళ కూడా తీరుతెన్నులు మార్చుకుని ఫ్యాషన్ ప్రపంచానికి తగ్గట్టు రెడీ అవుతోంది.
ఇప్పుడు చేనేతలో కూడా ఆకట్టుకునే డిజైన్లతో అద్భుతమైన డ్రస్ లు వస్తున్నాయి. డిజైనర్లు కూడా చేనేతతో అదిరిపోయే ఫ్యాషన్ వేర్ రూపొందిస్తున్నారు. దీంతో విదేశీయులు సైతం మన చేనేతను చూసి అబ్బురపడిపోతున్నారు. తాజాగా వరల్డ్ నెంబర్ వన్ బ్యాడ్మింటన్ స్టార్లెట్ కరోలినా మారిన్ తెలంగాణ చేనేతతో చేసిన డ్రస్ వేసుకుని తెగ ముచ్చట పడిపోయింది. స్పెయిన్ కు చెందిన ఈ బ్యూటీ కమ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ లో ఆడేందుకు మన దేశానికి వచ్చింది. ఈ సందర్భంగా ఇక్కడి డిజైనర్ దివ్యారెడ్డి రూపొందించిన ఫ్యాషన్ వేర్ తో ఫొటోలకు ఫోజులిచ్చింది.
ఈ చేనేత దుస్తులు తెగ నచ్చేయడంతో కరోలినా మారిన్ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంత అద్భుతమైన అవుట్ ఫిట్ డిజైన్ చేసినందుకు థ్యాంక్స్ చెబుతూ తెలంగాణా హ్యాండ్ లూమ్స్ ను ట్యాగ్ చేసింది. ఇప్పటికే తెలంగాణా హ్యాండ్ లూమ్ బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్ సమంత చేనేతను బాగానే ప్రమోట్ చేస్తోంది. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మెచ్చుకోవడంతో మన చేనేత మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకోవడం ఖాయం.